5 ప్రమాణాలు చేయటానికి కన్నా సిధ్దంగా ఉండాలి : ప్రతి సవాల్ విసిరిన అంబటి

కరోనా లాక్ డౌన్ టైమ్ లోనూ ఏపీ రాజకీయాలు ఇప్పుడు హాట్ హాట్ గా మారాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ రూ.20 కోట్లకు చంద్రబాబునాయుడుకు అమ్ముడుపోయారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన ఆరోపణలపై ఇప్పుడు వాదోపవాదాలు జరుగుతున్నాయి. తనపై చేసిన ఆరోపణలపై కాణిపాకం వినాయకుడి గుడిలో విజయసాయి రెడ్డి ప్రతిజ్ఞ చేయాలని కన్నాలక్ష్మినారాయణ సవాల్ విసరగా…వైసీపీ అందుకు సమ్మతించింది.
పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ కన్నాపై చేసిన ఆరోపణలకు మా వద్ద ఆధారాలు ఉన్నాయని….ఆయనే టైము, డేటు చెపితే అక్కడకు వచ్చి ప్రమాణం చేస్తామని సమాధానం చెప్పారు. ఇదే సమయంలో కన్నాలక్ష్మినారాయణ కూడా 5 ప్రమాణాలు చేయాలని అంబటి ప్రతి సవాల్ విసిరారు. బేజేపీ ఎంపీ సుజనా చౌదరి, రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణలు చంద్రబాబు కోవర్టులని, పార్టీ రాష్ట్ర శాఖను అమ్మేస్తారని అంబటి హెచ్చరించారు.
1)ఏప్రిల్ 24, 2018లో నాకు నిజంగానే గుండెజబ్బు వచ్చి ఆస్పత్రిలో చేరానని కన్నా ప్రమాణం చేయాలి.
2) కాంగ్రెస్ పార్టీ లో ఉండంగా 20 కోట్ల రూపాయలతో నేను సీఎం సీటు కొనుక్కోటానికి లంచంఇచ్చి ప్రయత్నం చేయలేదని ప్రమాణం చేయాలి
3) 2019 లో బీజేపీ అధ్యక్షుడిగా నాకు ఇచ్చిన ఫండ్ ను సద్వినియోగం చేశానని ప్రమాణం చేయాలి
4) చిన్న స్ధాయిలో ఉన్ననేను ఇన్ని వందల కోట్లకు అధిపతిగా అవటానికి కష్టపడి సంపాదించానే తప్ప రాజకీయ అవినీతి చేయలేదని ప్రమాణం చేయటానికి సిధ్ధంగా ఉండాలి
5) చంద్రబాబుకు 20 కోట్ల రూపాయలకు అమ్ముడు పోలేదని ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు.