సంచలనంగా మారిన శిరోముండనం ఘటన: నూతన్ నాయుడు భార్యపై కేసు

  • Published By: sekhar ,Published On : August 29, 2020 / 12:55 PM IST
సంచలనంగా మారిన శిరోముండనం ఘటన: నూతన్ నాయుడు భార్యపై కేసు

Updated On : October 31, 2020 / 4:18 PM IST

casefiled against Bigg Boss fame Nutan Naidu: బిగ్‌బాస్ సీజన్‌ 2 కంటెస్టెంట్‌ నూతన నాయుడుపై శిరోముండనం(గుండు గీయించడం) ఆరోపణలు సంచలనం సృష్టించాయి. నూతన నాయుడు తనను శిరోముండనం చేశారని దళిత యువకుడు కర్రి శ్రీకాంత్‌ పెందుర్తి పోలీసులను ఆశ్రయించారు.



ప్రస్తుతం పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధి సుజాతనగర్‌లో నూతన నాయుడు నివాసముంటున్నారు. అయితే గత నాలుగు నెలలుగా నూతన నాయుడు ఇంట్లో దళిత యువకుడు శ్రీకాంత్ పని చేస్తున్నారు. కాగా కరోనా వేళ ఆగస్టు ఒకటో తేదీ నుంచి నూతన నాయుడు ఇంట్లో శ్రీకాంత్ పని మానేసాడు.
https://10tv.in/cine-producer-tonsuring-sc-young-man-at-pendurthi/
కాగా, శ్రీకాంత్‌ చెప్పకుండా పనిమానేయడంతో నూతన నాయుడు భార్య మధుప్రియ శ్రీకాంత్‌కు ఫోన్‌ చేసి ఐ ఫోన్ పోయింది, దాని గురించి మాట్లాడదాం ఇంటికి రమ్మని పిలిచారని పోలీసులకు శ్రీకాంత్‌ చెప్పారు. ఈ నేపథ్యంలో ఇంటికి వచ్చిన శ్రీకాంత్‌ను తీవ్రంగా గాయపరచి గుండు కొట్టించినట్లుగా శ్రీకాంత్ ఆరోపించారు. ఈ విషయాన్ని బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించినట్లు శ్రీకాంత్ తెలిపారు.



శ్రీకాంత్‌ ఫిర్యాదు మేరకు నూతన్ నాయుడు భార్య మధుప్రియపై ఏ 1గా కేసు నమోదు చేశారు. అలాగే నూతన్ నాయుడు సిబ్బంది వరహాలు, ఇందిర, ఝాన్సీ, సౌజన్య, బాలు, రవిపై సెక్షన్ 307, 342, 323, 506, R/W 341PC, 3(1)B ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు. శ్రీకాంత్‌కు మద్దతుగా దళిత సంఘాలు ఆందోళన చేపట్టాయి. శ్రీకాంత్ శిరోముండనం ఘటన పెందుర్తిలో సంచలనంగా మారింది.