Konaseema District Collector : కోనసీమ జిల్లాలో కలెక్టర్‌కు తప్పిన ప్రమాదం.. పడవపై నుంచి కాల్వలో పడిపోవటంతో..

Konaseema District Collector : డాక్టర్ బీ.ఆర్. అంబేద్క కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్‌కు ప్రమాదం తప్పింది. ఆత్రేయపురం (మ) పులిదిండి వద్ద కలెక్టర్ పడవలో నుంచి కాల్వలో పడిపోయారు.

Konaseema District Collector : కోనసీమ జిల్లాలో కలెక్టర్‌కు తప్పిన ప్రమాదం.. పడవపై నుంచి కాల్వలో పడిపోవటంతో..

Konaseema District Collector Mahesh Kumar (Image Credit To Original Source)

Updated On : January 2, 2026 / 11:42 AM IST

Konaseema District Collector : డాక్టర్ బీ.ఆర్. అంబేద్క కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్‌కు ప్రమాదం తప్పింది. ఆత్రేయపురం (మ) పులిదిండి వద్ద కలెక్టర్ పడవలో నుంచి కాల్వలో పడిపోయారు.

సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఆత్రేయపురం మండలం పులిదిండి వద్ద భారీ స్థాయిలో పడవ పోటీలను నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు కలెక్టర్ శుక్రవారం ఉదయం పులిదిండికి వెళ్లారు. అక్కడ ట్రయల్ రన్‌లో కలెక్టర్ మహేశ్ కుమార్ పాల్గొన్నారు. స్వయంగా కయాకింగ్ నడిపారు. ఆ సమయంలో కలెక్టర్ కింద పడిపోయారు. కాస్త దూరం వెళ్లిన తరువాత కయాకింగ్ అదుపు తప్పి తిరగబడటంతో పడవ కాలువలో మునిగిపోయింది.

పడవ పైనుంచి కలెక్టర్ నీటిలో పడిపోయిన వెంటనే గజ ఈతగాళ్లు, ఇతర సిబ్బంది కలెక్టర్‌ను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. లైఫ్ జాకెట్ ఉండటంతో నీట మునగలేదు. కలెక్టర్ కు ప్రమాదం తప్పడంతో అధికారులు, స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.