Rahul Murder Case : రాహుల్‌ హత్య కేసులో లొంగిపోయిన కోరాడ విజయ్‌కుమార్‌

బెజవాడ రాహుల్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడు కోరాడ విజయ్‌కుమార్‌... పోలీసుల ఎదుట లొంగిపోయాడు. మాచవరం పోలీస్‌ స్టేషన్‌లో సరెండర్‌ అయ్యాడు. ఆరుగురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు.

Rahul Murder Case : రాహుల్‌ హత్య కేసులో లొంగిపోయిన కోరాడ విజయ్‌కుమార్‌

Vijaykumar

Updated On : August 22, 2021 / 6:01 PM IST

Korada Vijay Kumar surrender : బెజవాడ యువ వ్యాపారి రాహుల్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడు కోరాడ విజయ్‌కుమార్‌… పోలీసుల ఎదుట లొంగిపోయాడు. మాచవరం పోలీస్‌ స్టేషన్‌లో సరెండర్‌ అయ్యాడు. విజయ్‌కుమార్‌ సహా మొత్తం ఆరుగురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. రాహుల్‌ మర్డర్‌ కేసులో వారిని విచారిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 18న బెజవాడలో రాహుల్‌ దారుణ హత్యకు గురయ్యాడు.

రాహుల్‌లో కలిసి వ్యాపారం చేస్తున్న కోరాడ విజయ్‌కుమారే హత్య చేయించినట్లు పోలీసులు భావించారు. రాహుల్‌ మర్డర్‌ తర్వాత విజయ్‌కుమార్‌ పరారీ కావడంతో… అతడిపై అనుమానాలు బలపడ్డాయి. విజయ్‌కుమార్‌ను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాల్ని నియమించాయి. ఐదు రోజులుగా అతడి కోసం వేటాడుతున్నాయి. ఈ క్రమంలో విజయ్‌కుమార్‌.. ఇవాళ మాచవరం పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు.

రాహుల్‌ మర్డర్‌ కేసులో అనుమానితుడిగా ఉన్న కోరాడ విజయ్‌కుమార్‌ డ్రైవర్‌… బాబును నిన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నూజివీడు దగ్గర టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బాబును అదుపులోకి తీసుకున్నారు. రాహుల్‌ హత్య జరిగిన రాత్రి నుంచి కారు డ్రైవర్‌ బాబు పరారీలో ఉన్నాడు. డ్రైవర్‌పై నిఘా పెట్టిన పోలీసులు.. నిన్న అతడిని అదుపులోకి తీసుకున్నారు. రాహుల్‌ మర్డర్‌పై బాబును విచారిస్తున్నారు.

రాహుల్ తండ్రి రాఘవరావు ఫిర్యాదు మేరకు ఐదుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏ1గా కోరాడ విజయ్‌కుమార్, ఏ2గా కోగంటి సత్యం పేర్లు చేర్చారు. ముగ్గురు మహిళల ప్రేమేయం కూడా రాహుల్ హత్యలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ హత్యతో పాత్రధారులుగా భావిస్తున్న పద్మజ అనే పేరుతో ఉన్న ఇద్దరు మహిళల పేర్లను కూడా ఏ3, ఏ4గా చేర్చారు.

కోగంటి సత్యం ద్వారా ఫ్యాక్టరీ కొనుగోలుకు చర్చలు జరిగాయని… తన వాటా డబ్బుల కోసం కోరాడ విజయ్‌కుమార్ అనేకసార్లు ఒత్తిడి తెచ్చారని రాహుల్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోరాడ కుటుంబ సభ్యులకు హత్యతో సంబంధముందని రాహుల్ తండ్రి రాఘవరావు ఆరోపిస్తున్నారు.

అయితే ఇవాళ కోరాడ విజయ్‌కుమార్‌ పోలీసులకు లొంగిపోయాడు. విజయ్‌కుమార్ లొంగుబాటుతో రాహుల్ హత్య కేసు కొలిక్కి వస్తుందా? రాహుల్‌ హత్యపై పోలీసులకు కోరాడ విజయ్‌కుమార్ ఏం చెప్పాడు? అనే సందేహాలు వస్తున్నాయి.