ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న రూ.50 లక్షలు పట్టివేత

ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న రూ.50 లక్షలు పట్టివేత

Updated On : January 21, 2021 / 11:58 AM IST

Krishna police seized Rs.50 Lakhs At Donabanda check post : విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కు అక్రమంగా తరలిస్తున్నరూ.50 లక్షల రూపాయలను కృష్ణాజిల్లా పోలీసులు పట్టుకున్నారు. రోజువారీ తనిఖీల్లో భాగంగా దొనబండ చెక్ పోస్టు వద్ద తనిఖీలు చేస్తున్నపోలీసులకు గరుడ బస్సులు ఒక వ్యక్తి రూ. 50 లక్షలు తరలిస్తున్నట్లు గుర్తించారు. ఆనగదుకు  సరైన ఆధారాలు చూపించనందున నగదును, వ్యక్తిని అగుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. విశాఖ పట్నం నుంచి హైదరాబాద్ నగదు తరలిస్తున్నట్లు పోలీసుల తెలిపారు. నగదున ఆదాయపన్నుశాఖ అధికారులకు అందచేశారు.