Kurnool : పోలీసు వాట్సాప్ గ్రూపులో మట్కా డాన్ కూతురు ఫోన్ నంబర్

పోలీసు వాట్సాప్ గ్రూప్‌లో నంద్యాల మట్కా డాన్ కూతురు సెల్ నెంబర్ కలకలం రేపుతోంది. దీంతో పోలీసులే మట్కా నిర్వాహకులకు సహకరిస్తున్నారా? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఏపీలోని కర్నూలు జిల్లా పోలీసుల వాట్సాప్ గ్రూపుల్లో మాట్కా డాన్ కూతురు సెల్ ఫోన్ నంబర్ ఉండటం తీవ్ర కలకలం రేపుతోంది.

Kurnool : పోలీసు వాట్సాప్ గ్రూపులో మట్కా డాన్ కూతురు ఫోన్ నంబర్

Updated On : July 15, 2021 / 1:51 PM IST

Matka Don daughter phone number : పోలీసు వాట్సాప్ గ్రూప్‌లో నంద్యాల మట్కా డాన్ కూతురు సెల్ నెంబర్ కలకలం రేపుతోంది. పోలీస్ అధికారుల కదలికల గురించి మట్కా నిర్వాహకులు తెలుసుకుంటున్నారా? పోలీసులే మట్కా డాన్ సభ్యులకు సమాచారం అందిస్తున్నారా? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ క్రమంలో పోలీసుల వాట్సాప్ గ్రూపుల్లో మాట్కా డాన్ కూతురు సెల్ ఫోన్ నంబర్ కూడా ఫీడ్ అయి ఉండటం తీవ్ర కలకలం రేపుతోంది.

పోలీసుల దర్యాప్తు, అరెస్టులు, ఆకస్మిక తనిఖీల సమాచారం మట్కా నిర్వాహకులు తెలుసుకుంటున్నానే విషయం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మట్కా స్థావరంపై దాడులతో వెలుగులోకి ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మట్కా డాన్ కుటుంబంతో కొందరు పోలీసులు సన్నిహితంగా ఉంటున్నారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు.

కాగా ఇటీవల మాట్కా డాన్ అసదుల్లాను కర్నూలు జిల్లా నంద్యాల త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మాట్కా డాన్ కు ఆరుగురు పోలీసులు సహాకారం అందించినట్లుగా సమాచారం. పోలీసులే అసాంఘీక కార్యకపాలకు పాల్పడుతున్నారని..మట్కా నిర్వాహకులకు సహకారం అందిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తటంతో పోలీసులు వాట్సాప్ గ్రూపుల నుంచి డాన్ కూతురు ఫోన్ నంబర్ ను అధికారులు తొలగించారు. కాగా పోలీసుల వాట్సాప్ గ్రూపుల్లో మట్కా డాన్ కూతురు ఫోన్ నంబర్ ఉన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి రావటంతో ఉన్నతాధికారులు స్పందించి ఆమె నంబర్ ను తొలగించినట్లుగా తెలుస్తోంది.