Leopard : కర్నూలు జిల్లా కోసిగిలో చిరుత పులి కలకలం

అటవీ శాఖ సిబ్బంది పట్టించుకోకపోడంతో ధైర్యం చేసిన కొంతమంది స్థానికులు బసవన్న కొండపై సంచరిస్తున్న చిరుతపులి వీడియో తీశారు. ఇప్పటికైనా చిరుతపులిని పట్టుకోవాలని కోసిగి శివారు ప్రాంత ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

Leopard : కర్నూలు జిల్లా కోసిగిలో చిరుత పులి కలకలం

Leopord

Updated On : July 1, 2022 / 6:34 PM IST

Kurnool Leopard : కర్నూలు జిల్లా కోసిగిలో చిరుత పులి కలకలం రేగింది. కొన్ని రోజులుగా కోసిగి శివారు బసవన్న కొండపై చిరుతపులి సంచరిస్తోంది. గొర్రెలు, మేకలు, కోతులపై పలుమార్లు దాడి చేసింది.

అటవీ శాఖ అధికారులకు పలు మార్లు చెప్పినా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. చిరుత సంచారంతో, పశువులపై దాడులతో అనుక్షణం భయపడుతున్నామని ఆవేదన చెందుతున్నారు.

Leopard Attack: అర్ధరాత్రి పెంపుడు కుక్కపై చిరుత దాడి.. వీడియో వైరల్