Leopard Attack: అర్ధరాత్రి పెంపుడు కుక్కపై చిరుత దాడి.. వీడియో వైరల్

చిరుత పులులు జనావాసాల మధ్యలోకి రావడం, స్థానికంగా ఉన్న జంతువులపై, మనుషులపైన దాడులు చేయటం పరిపాటిగా మారింది. అడవులను వదిలి జనావాసాల్లోకి వస్తుండటంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. తాజాగా మహారాష్ట్రం నాసిక్ లోని ఓ గ్రామంలో అర్థరాత్రి సమయంలో చిరుతపులి ఓ ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించింది.

Leopard Attack: అర్ధరాత్రి పెంపుడు కుక్కపై చిరుత దాడి.. వీడియో వైరల్

Leopard

Leopard Attack: చిరుత పులులు జనావాసాల మధ్యలోకి రావడం, స్థానికంగా ఉన్న జంతువులపై, మనుషులపైన దాడులు చేయటం పరిపాటిగా మారింది. అడవులను వదిలి జనావాసాల్లోకి వస్తుండటంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. తాజాగా మహారాష్ట్రం నాసిక్ లోని ఓ గ్రామంలో అర్థరాత్రి సమయంలో చిరుతపులి ఓ ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించింది. అక్కడే ఉన్న కుక్కపై దాడికి యత్నించింది. దీంతో ఒక్కసారిగా అలర్ట్ అయిన కుక్క చిరుత దాడి నుంచి తప్పించుకొనే ప్రయత్నం చేసింది. చివరికి చిరుతకు చిక్కి దానికి ఆహారమైంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గామారింది.

మహారాష్ట్ర నాసిక్‌లోని ఓ గ్రామంలో నివాస ప్రాంతంలోకి ప్రవేశించిన చిరుతపులి పెంపుడు కుక్కపై దాడి చేసింది. వీడియోలో అర్థరాత్రి సమయంలో నల్ల కుక్క తక్కువ ఎత్తులో ఉన్న ఓ గోడపై కూర్చొని ఉంది. కొన్ని సెకన్ల తర్వాత దానికి చిరుతపులి కనిపించింది. దీంతో గోడపైనుంచి దూకి తప్పించుకొనే ప్రయత్నంలో కుక్కను గమనించిన చిరుత ఒక్కసారిగా దాడికి యత్నించింది. చిరుతపులి మొదట్లో కుక్కనుచూసి వెనుదిరిగింది. మళ్లీ వెనుక్కు తిరిగొచ్చి కుక్కపై దాడి చేసింది. చిరుతపులి పంజా నుంచి తప్పించుకొనేందుకు ప్రయత్నించినప్పటికీ కుక్కకు అవకాశం లేకుండాపోయింది. చిరుతదాడిలో కుక్క ప్రతిఘటించినప్పటికీ కొద్దిసేపటి తరువాత చిరుతపులి తన దవడల్లో కుక్కను తీసుకొని వెళ్లిపోతుంది. ఈ ఘటనపై నాసిక్ ఫారెస్ట్ డిప్యూటీ కన్జర్వేటర్ పంకజ్ గార్గ్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో చిరుతపులి సంచారం ఎక్కువైనందున ముంగ్సారే గ్రామ ప్రజలు రాత్రిపూట ఇళ్లలోనే ఉండాలని మేము విజ్ఞప్తి చేస్తున్నామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ చేశామని తెలిపారు.

Leopard Burnt: చిరుతను సజీవ దహనం చేసిన గ్రామస్తులు.. 150 మందిపై కేసు

ఇదిలా ఉంటే ఇంట్లోని పెంపుడు కుక్కపై చిరుతపులి దాడి చేసిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈవీడియోను సుమారు 90వేల మంది వీక్షించి కామెంట్లు చేస్తున్నారు. చిరుతపులి దాడి చేస్తుందని తెలిసినా తమ పెంపుడు కుక్కలను బయట ఎందుకు ఉంచుతున్నారు అంటూ ఓ నెటిజన్ ప్రశ్నించారు. ఇదిలాఉంటే నాసిక్‌ ప్రాంతంలో నివాస ప్రాంతాలలోకి చిరుతలు ప్రవేశించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ ఏడాది జనవరిలో నాసిక్ నగరంలోని నివాస ప్రాంతం నుంచి ఎనిమిది గంటలపాటు జరిగిన ఆపరేషన్‌లో చిరుతపులిని రక్షించారు. ఈ ఘటనలో ఒకరిపై దాడి జరిగింది.