Liquor Prices : ఏపీలో మందుబాబులకు షాక్.. మద్యం ధరలు పెంపు

ఈ మేరకు జీవో ఎంఎస్ నెంబర్ 42 ను జారీ చేశారు ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేశ్ కుమార్ మీనా.

Liquor Prices : ఏపీలో మందుబాబులకు షాక్.. మద్యం ధరలు పెంపు

Updated On : February 10, 2025 / 10:18 PM IST

Liquor Prices : ఏపీలో మద్యం ధరలు పెరగనున్నాయి. మద్యం షాపుల అమ్మకందారులకు మార్జిన్ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాని ఫలితంగా అడిషనల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ 1 ను రివిజన్ చేసింది ప్రభుత్వం. దీంతో 99 రూపాయల మద్యం, బీర్ల ధరలు మినహా మిగిలిన అన్ని బ్రాండ్లపైన 10 రూపాయల మేర ధర పెరగనుంది.

ఈ మేరకు అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ను ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ రివైజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీవో ఎంఎస్ నెంబర్ 42 ను జారీ చేశారు ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేశ్ కుమార్ మీనా.

Also Read : కిరణ్ రాయల్ సంచలనం.. అద్భుతాలు బయటపెడుతున్నా..

మద్యం అమ్మకందారులకు మార్జిన్ ను 10శాతం నుంచి 14 శాతానికి పెంచింది సర్కార్. దీంతో ధరల పెంపు అనివార్యమైనట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. ఇకపై మూడు కేటగిరీలుగా (ఇండియన్ మేడ్, ఫారిన్ మేడ్, బీర్) మద్యం సరఫరా ఉంటుందని వెల్లడించాయి.