ఏపీలో మరో ప్రేమోన్మాదం, పురుగుల మందు తాగలేదని ప్రియురాలి దారుణ హత్య

lover kills girl friend: ప్రేమించిన యువతితో జీవితాంతం కలిసి జీవించాలని కోరుకుంటారు ఎవరైనా. కానీ ఈ యువకుడు మాత్రం క్రూరంగా ఆలోచించాడు. ప్రేమించిన అమ్మాయి చనిపోవడానికి ఒప్పుకోలేదని పగ పెంచుకున్నాడు. మాట్లాడే పని ఉందంటూ తీసుకెళ్లి కడతేర్చాడు. ఈ ప్రేమోన్మాదం అనంతపురం జిల్లాలో వెలుగు చూసింది.
చివరి నిమిషంలో మనసు మార్చుకున్న ప్రియురాలు, ఆత్మహత్యకు నో:
కళ్యాణదుర్గం మండలం చాపిరి గ్రామానికి చెందిన షాహిదా బేగం, రఘు మూడేళ్లు ప్రేమించుకున్నారు. ఇద్దరి పెళ్లికి పెద్ద వాళ్లు ఒప్పుకోలేదు. అంతేకాదు..ఇటీవల ఇరు కుటుంబాల పెద్దలు ఇద్దరికీ వేర్వేరుగా పెళ్లి నిశ్చయించారు. దీంతో ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకుందామని ప్రియురాలిని ఒప్పించాడు రఘు. అయితే ఈ విషయంలో ఆ తరువాత షాహిదా మనసు మార్చుకుంది. రఘు పురుగుల మందు తాగినా…ఆమె మాత్రం అందుకు నిరాకరించింది. అదృష్టావశాత్తు అతడు ప్రాణాలతో బతికి బయటపడ్డాడు.