విషాదం : ప్రేమించుకున్న అక్కాతమ్ముడు.. పెద్దలు ఒప్పుకోరని ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లా కులకచర్ల మండలం కామునిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. వరుసకు అక్కా, తమ్ముడు ప్రేమించుకున్నారు. తమ ప్రేమకు

  • Published By: veegamteam ,Published On : February 6, 2020 / 06:34 AM IST
విషాదం : ప్రేమించుకున్న అక్కాతమ్ముడు.. పెద్దలు ఒప్పుకోరని ఆత్మహత్య

Updated On : February 6, 2020 / 6:34 AM IST

రంగారెడ్డి జిల్లా కులకచర్ల మండలం కామునిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. వరుసకు అక్కా, తమ్ముడు ప్రేమించుకున్నారు. తమ ప్రేమకు

రంగారెడ్డి జిల్లా కులకచర్ల మండలం కామునిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. వరుసకు అక్కా, తమ్ముడు ప్రేమించుకున్నారు. తమ ప్రేమకు కుటుంబ సభ్యులు అడ్డుపడతారన్న మనస్తాపంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కామునిపల్లికి చెందిన డిగ్రీ విద్యార్థిని 20 ఏళ్ల మమత, వరుసకు తమ్ముడైన 19 ఏళ్ల ప్రశాంత్‌ ప్రేమించుకున్నారు. కలిసి జీవించేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించన్న మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఎంత పని చేశారని గుండెలు బాదుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబసభ్యులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.

* రంగారెడ్డి జిల్లా కులకచర్ల మండలం కామునిపల్లిలో విషాదం 
* వరుసకు అక్కా తమ్ముడైన ప్రేమజంట ఆత్మహత్య 
* ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న మమత (20) ప్రశాంత్‌ (19)

* ప్రేమకు కుటుంబ సభ్యులు అంగీకరించరన్న మనస్తాపంతో ఆత్మహత్య 
* కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు