Weather Forecast : బిగ్ అలర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. రైతులకు కీలక సూచనలు

Weather Forecast ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది పశ్చిమ - వాయువ్య దిశగా కదులుతూ

Weather Forecast : బిగ్ అలర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. రైతులకు కీలక సూచనలు

Weather Forecast

Updated On : November 21, 2025 / 7:33 AM IST

Weather Forecast : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి తీవ్రతతో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రజలకు బయటకు రావాలంటే భయపడుతున్నారు. మరోవైపు చలితీవ్రత ఎక్కువగా ఉండటంతో అనారోగ్య సమస్యల బారినపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచనలు చేస్తున్నారు. అయితే, ఈ చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. మరోవైపు.. వర్షాలుసైతం దంచికొట్టనున్నాయి.

బంగాళాఖాతంలో ఈశాన్య రుతుపవనాలు కారణంగా ఒకదాని తరువాత ఒకటి అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. దీంతో అవి తుఫానులుగా మారే క్రమంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ కేంద్రం పేర్కొంది. మరోవైపు, బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

Also Read: AP Govt : ఏపీ ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమం.. అన్నదాతల ఇళ్లకు ప్రజాప్రతినిధులు, అధికారులు..

ఉపరితల ఆవర్తన ప్రభావంతో రెండు రోజుల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది పశ్చిమ – వాయువ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే చాన్స్ ఉందని పేర్కొంది. ఈ క్రమంలో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి.

ఇవాళ, రేపు కృష్ణా, బాపట్ల, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అయితే, బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారే బలపడే చాన్స్ ఉండటంతో ఈనెల 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఏపీలోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

వర్షాల దృష్ట్యా వరి కోతలు సహా వ్యవసాయ పనుల్లో తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా రైతులకు విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. అలాగే పండిన ధాన్యాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని స్పష్టం చేసింది. అత్యవసర సహాయం కోసం.. కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 1800 42 50101 సంప్రదించాలని రైతులకు విజ్ఞప్తి చేసింది.