Maganti Ravindranath : మాజీ ఎంపీ మాగంటి బాబు రెండో కొడుకు మృతికి కారణం అదేనా?

ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు రెండో కుమారుడు మాగంటి రవీంద్రనాథ్ చౌదరి మృతి చెందిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని స్టార్ హోటల్‌ పార్క్ హయత్‌లో ఆయన అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. మాగంటి రవీంద్ర రక్తపు వాంతులు

Maganti Ravindranath : మాజీ ఎంపీ మాగంటి బాబు రెండో కొడుకు మృతికి కారణం అదేనా?

Maganti Babus Second Son Maganti Ravindranath Death Case

Updated On : June 2, 2021 / 11:37 AM IST

Maganti Ravindranath : ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు రెండో కుమారుడు మాగంటి రవీంద్రనాథ్ చౌదరి మృతి చెందిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని స్టార్ హోటల్‌ పార్క్ హయత్‌లో ఆయన అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. మాగంటి రవీంద్ర రక్తపు వాంతులు చేసుకుని చనిపోయారని పోలీసులు వెల్లడించారు. హోటల్‌ బాత్రూమ్ ఆయన అచేతనంగా పడిపోయి ఉండగా.. విషయం తెలుసుకున్న సిబ్బంది వెంటనే అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే, అప్పటికే చనిపోయినట్లుగా డాక్టర్లు నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు పోలీసులు.

రంగంలోకి దిగిన పోలీసులు సీఆర్పీసీ 174 అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. రవీంద్రనాథ్ తండ్రి మాగంటి బాబు స్టేట్ మెంట్ తీసుకున్నారు. మాగంటి రవీంద్రనాథ్ మద్యానికి బానిసగా మారినట్టు పోలీసులు తెలిపారు. ఆ అలవాటు మానేందుకు రెండు వారాలుగా రిహాబిలిటేషన్ సెంటర్ లో కౌన్సిలింగ్ తీసుకుంటూ హోటల్ లో ఉంటున్నారు.

నిన్న(జూన్ 1,2021) హోటల్ ఖాళీ చేస్తున్నట్లు హోటల్ సిబ్బందికి తెలిపారు మాగంటి రవీంద్రనాథ్. ఇంతలోనే లోపలి నుంచి డోర్ లాక్ పెట్టుకోవడంతో అనుమానం వచ్చింది. హోటల్ సిబ్బంది ఎలక్ట్రానిక్ కార్డుతో డోర్ ఓపెన్ చేశారు. బాత్రూమ్ లోకి వెళ్లి చూసి షాక్ తిన్నారు. రవీంద్రనాథ్ బాత్రూమ్ లో అచేతనంగా పడి ఉన్నారు. ఆయన నోటి నుండి రక్తం కారుతోంది. అధిక మోతాదులో మద్యం తాగడం వల్లే ఆయన మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. వెంటనే హోటల్ సిబ్బంది పోలీసులకు ఫోన్ చేశారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కొన్నాళ్ల క్రితం మాగంటి రవీంద్ర అనారోగ్యానికి గురి కావడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అయితే, ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయి హైదరాబాద్ చేరుకున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా ఆయన బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్‌లోనే ఉంటున్నట్లు సమాచారం. మాగంటి రవీంద్రకు మద్యం, ఇతర అలవాట్లు ఉండడంతో వాటిని మాన్పించేందుకు ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఇటీవలే మాగంటి బాబు పెద్ద కుమారుడు మాగంటి రాంజీ కూడా మరణించిన సంగతి తెలిసిందే. ఇద్దరు కుమారులు వెంట వెంటనే చనిపోవడంతో మాగంటి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.