పండుగ పూట గుడ్‌న్యూస్.. రూ.1,500 కోట్ల ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ విడుదలకు నిర్ణయం.. ఇకపై..
ప్రభుత్వ తాజా నిర్ణయంతో చిన్న, మధ్య తరహా వ్యాపారులకు భారీ ఊరట దక్కనుంది.

Chandrababu Naidu: దీపావళి వేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో తీపి కబురు అందించారు. పరిశ్రమలకు మద్దతుగా, వ్యాపారాలకు ఏపీని గమ్యస్థానంగా నిలిపేందుకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని తెలిపారు.
పరిశ్రమలకు ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ విడుదలకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తొలి విడతగా రూ.1,500 కోట్ల పారిశ్రామిక రాయితీల విడుదలకు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. (Chandrababu Naidu)
ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రగతిలో భాగస్వాములైన పారిశ్రామికవేత్తలకు అండగా నిలవాలన్న లక్ష్యంతో చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో చిన్న, మధ్య తరహా వ్యాపారులకు భారీ ఊరట దక్కనుంది.
పేదలకు సంక్షేమ పథకాలు, పెట్టుబడులతో ఉద్యోగ అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక చెల్లింపులు, వ్యాపారస్తులకు ప్రోత్సాహకాలు అందిస్తూ ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా నిలుస్తోందని కూటమి నేతలు అంటున్నారు.