AP Mega DSC : మెగా డీఎస్సీ మెరిట్ జాబితా.. మంత్రి నారా లోకేశ్ కీలక సూచనలు.. అలా మోసపోవద్దు..
AP Mega DSC : క్రీడా కోటా మెరిట్ జాబితా పూర్తయిందని, మెరిట్ జాబితా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.

AP Mega DSC
AP Mega DSC : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మెగా డీఎస్సీ 2025 ఫలితాలు విడుదలయిన విషయం తెలిసిందే. తదుపరి కీలక ప్రక్రియ మొదలైంది. ఏపీ మెగా డీఎస్సీ (AP Mega DSC) మెరిట్ జాబితాను ఇవాళ (శుక్రవారం) విడుదల చేయనున్నామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. క్రీడా కోటా మెరిట్ జాబితా పూర్తయిందని, మెరిట్ జాబితా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.
Also Read: New Jobs : నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. 2.5లక్షల కొత్త ఉద్యోగాలు.. ఏఏ రంగాల్లో అంటే..?
వాళ్లను నమ్మి మోసపోవద్దు..
ఉపాధ్యాయ ఉద్యోగం ఇప్పిస్తామని దళారులు చెప్పే మాటలు, కొంతమంది సామాజిక మాధ్యమాల వేదికగా చేస్తున్న వందతులను నమ్మొద్దని అభ్యర్థులకు మంత్రి నారా లోకేశ్ సూచించారు. దుష్ర్పచారాలను నమ్మి మోసపోవద్దు. వదంతులు వ్యాప్తి చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు.
ఇలా చేయండి..
♦ మెరిట్ జాబితా డీఎస్సీ అధికారిక వెబ్ సైట్లలో ఉంచుతారు.
♦ అభ్యర్థులు ఈ వెబ్ సైట్ల నుంచి మాత్రమే సమాచారం పొందాలి.
♦ వివిధ కేటగిరీలకు సంబంధించిన పోస్టుల నియామక ప్రక్రియలో భాగంగా జోన్ ఆఫ్ కన్సిడరేషన్‌లోకి వచ్చిన అభ్యర్థులకు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్ అందిస్తారు.
♦ అభ్యర్థులు సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఇటీవల తీసుకున్న కుల ద్రువీకరణ పత్రం, గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించిన మూడు సెట్ల జిరాక్స్ కాపీలు, ఐదు పాస్ పోర్టు ఫొటోలతో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుంది.
♦ పరిశీలనకు హాజరు కావడానికి ముందే సంబంధిత సర్టిఫికెట్లను వెబ్ సైట్ లో అప్లోడ్ చేయాలి.
♦ పరిశీలన సమయంలో సమర్పించాల్సిన సర్టిఫికెట్ల వివరాలతో కూడిన చెక్ లిస్టును వెబ్‌సైట్‌లో అధికారులు ఉంచుతారు.
♦ ధ్రువపత్రాల పరిశీలనకు అభ్యర్థి హాజరు కాకపోయినా.. సరైన సర్టిఫికెట్లు సమర్పించకపోయినా తగిన విద్యార్హతలు లేనట్లుగా పరిగణిస్తాం. ఆ తరువాత ఉన్న అభ్యర్థికి అవకాశం ఇవ్వడం జరుగుతుందని అధికారులు తెలిపారు.