Megha Oxygen Tankers : ఏపీకి మేఘా సాయం.. 3 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు

కరోనా కష్టకాలంలో ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు ఏపీ సర్కార్‌కు మేఘా ఇంజినీరింగ్ సంస్థ సాయం చేసింది. ఏపీ రాష్ట్రానికి మూడు క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లను మేఘా అందజేసింది. 

Megha Oxygen Tankers : ఏపీకి మేఘా సాయం.. 3 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు

Megha Engineering Helps Ap Govt Sending 3 Cryogenic Oxygen Tankers

Updated On : June 11, 2021 / 6:21 PM IST

Megha Oxygen Tankers : కరోనా కష్టకాలంలో ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు ఏపీ సర్కార్‌కు మేఘా ఇంజినీరింగ్ సంస్థ సాయం చేసింది. ఏపీ రాష్ట్రానికి మూడు క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లను మేఘా అందజేసింది.

ఒక్కో క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్ సామర్థ్యం 25 మెట్రిక్ టన్నులు ఉంటుంది. ఇప్పటికే కృష్ణ పట్నం పోర్టుకు క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు చేరుకున్నాయి. రాయలసీమ, నెల్లూరు జిల్లాకు ఈ ఆక్సిజన్ ట్యాంకర్లను కేటాయించారు.

ఇదివరకే 1.40 కోట్ల లీటర్ల ఆక్సిజన్ సామర్ధ్యమున్న ట్యాంకర్లను సింగపూర్ నుంచి ఏపీకి తెప్పించింది మేఘా ఇంజనీరింగ్ సంస్థ. సింగపూర్ నుంచి ఏపీకి చేరుకున్న వెంటనే..
దుర్గాపూర్ ఉక్కు కర్మాగారానికి తరలించారు.

ఇండియాలో ఒక్కొక్క క్రయోజనిక్ ట్యాంకర్ తయారు చేయాలంటే కనీసం మూడు నెలల సమయం పడుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ట్యాంకర్లను సిద్ధం చేయాలంటే కుదిరే పనికాదు.. అందుకే సింగపూర్ నుంచి 3 క్రయోజనిక్ ట్యాంకర్లను ఏపీ ప్రభుత్వం కోసం మేఘా ఇంజనీరింగ్ అందించింది.