Minister Ambati Rambabu: పవన్ కళ్యాణ్‌పై మంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు.. చీడ పురుగు అంటూ ఆగ్రహం..

రాజకీయాలకు పనికిరాని వ్యక్తి పవన్ కళ్యాణ్.. రాజకీయాలకు చీడ పురుగు పవన్ కళ్యాణ్ అంటూ.. మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

Minister Ambati Rambabu: పవన్ కళ్యాణ్‌పై మంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు.. చీడ పురుగు అంటూ ఆగ్రహం..

Minister Ambati Rambabu

Andhra Pradesh : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పై ఏపీ మంత్రి అంబటి రాంబాబు (Minister Ambati Rambabu) సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయం లేని, రాని రాజకీయ పార్టీ జనసేన (Jana sena) అంటూ విమర్శించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జనసేన వారాహి విజయ యాత్ర (Varahi Vijaya Yatra) పేరులో మాత్రమే విజయం ఉందని ఎద్దేవా చేశారు. ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రమే చంద్రబాబు (Chandrababu) కు జనసేన అమ్మాడా? ఉభయ గోదావరి జిల్లాల్లో పోటీ చేస్తే పవన్ అధికారంలోకి వస్తారా..? జగన్ పోవాలంటున్న పవన్ ఎవరు రావాలో చెప్పాలి అంటూ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు.

Pawan Kalyan: వ్యక్తిగత విషయాలపై మాట్లాడడం చిల్లర వ్యవహారం.. జగన్ వ్యక్తిగత జీవితం నాకు తెలుసు.. నేను చెప్పేది వింటే..

జగన్ పోతే సంక్షేమ పథకాలన్నీ పోతాయి. అందుకే జగన్ పోవాలన్న వాడే పోవాలి అంటూ మంత్రి అంబటి విమర్శించారు. చెప్పుతీసి చూపించడం.. పాలసీ నా, సమస్య నా? వైసీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని తిట్టడం పాలసీనా అంటూ ప్రశ్నించారు. రాజకీయాల్లో పవన్ కల్యాణ్ చీడ పురుగు అంటూ అంబటి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రష్యాతో ఉన్న సన్నిహిత సంబంధం దెబ్బతింటుంది అది చూసుకో పవన్ అంటూ ఎద్దేవా చేశారు.

రాజకీయాలకు పనికిరాని వ్యక్తి పవన్ కళ్యాణ్.. పవన్ కల్యాణ్ మ్యాడ్ డాగ్. పిచ్చికుక్క. పవన్ కళ్యాణ్ అసాంఘిక శక్తి అంటూ అంబటి విమర్శించారు. పవన్ వివాహ వ్యవస్థలో విప్లవం తీసుకొచ్చాడు. పవన్ కళ్యాణ్‌లోనే తేడా ఉంది. పెళ్ళిళ్ళ విప్లవ వీరుడు పవన్ అంటూ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.