బాబుకు అవంతి ఛాలెంజ్: విశాఖ నలుగురు ఎమ్మేల్యలను రాజీనామా చేయించండి.. ఒక్కరు తిరిగి గెల్చినా…మంత్రిగా రాజీనామా చేస్తా

బాబుకు అవంతి ఛాలెంజ్: విశాఖ నలుగురు ఎమ్మేల్యలను రాజీనామా చేయించండి.. ఒక్కరు తిరిగి గెల్చినా…మంత్రిగా రాజీనామా చేస్తా

Updated On : August 8, 2020 / 3:07 PM IST

వైసీపీకి న్యాయ వ్యవస్థ మీద గౌరవముంది. అలాంటి అవసరం తప్పక ఉంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తాం.పూర్తిగా రాజ్యాంగ వ్యవస్థకు లోబడే చేస్తున్నామని మంత్రి అవంతి అన్నారు. శనివారం మీడియా ముందు మాట్లాడిన ఆయన.. చంద్రబాబు తీరుపై మంత్రి అవంతి సీరియస్ వ్యక్తం చేశారు.



‘అమరావతి గురించి మొసలి కన్నీరు కారుస్తున్నారు. ఉదయం సింగపూర్, మధ్యాహ్నం చైనా, రాత్రి జపాన్ గురించి చెప్పేవారు. అమరావతి రైతుల పట్ల గానీ వాళ్ల భూముల గురించి గానీ కించపరిచేవిధంగా వైసీపీ నాయకులు ఎప్పుడూ మాట్లాడరు’



‘విశాఖ అభివృద్ధి గురించి చంద్రబాబు ఏనాడు ఆలోచించలేదు. వైజాగ్ రాజధాని కోరుకోవడం లేదని అనుకుంటే ఈ సవాల్ అందుకోండి. మీ నలుగురు ఎమ్మెల్యేలు రాజధాని వద్దని చెప్పి మళ్లీ పోటీ చేయండి. గెలిస్తే అప్పుడు చూద్దాం. నలుగురిలో ఒక్కరు గెలిచినా రాజీనామాకు సిద్ధం’ అని అవంతి శ్రీనివాస్ సవాల్ విసిరారు.



175మంది మళ్లీ పోటీ చేయనవసరం లేదు. కేవలం మీ నలుగురు ఎమ్మెల్యేలు పోటీ చేయగలరా.. ఒక్కరు కూడా ముందుకురారంటూ మంత్రి అవంతి విమర్శించారు.