Minister Chelluboina : మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణకు అస్వస్థత, ఆసుపత్రిలో చేరిక
డాక్టర్ల సూచనలతో మణిపాల్ హాస్పిటల్ లో మంత్రి అడ్మిట్ అయ్యారు. మంత్రికి వైద్య పరీక్షలు చేయనున్నారు.

Chelluboina Srinivasa Venugopala Krishna (Photo : Facebook)
ఏపీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయన ఆసుపత్రిలో చేరారు. తాడేపల్లిలోని మణిపాల్ హాస్పిటల్ లో మంత్రి వేణుగోపాల కృష్ణకు చికిత్సకు అందిస్తున్నారు. మంత్రి వేణు ఈ మధ్యాహ్నం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వాంతులు అయ్యాయి. దాంతో ఆయన ఆసుపత్రికి వెళ్లారు. గుండె సంబంధిత పరీక్షలతో పాటు పూర్తి హెల్త్ చెకప్ చేయాలని వైద్యులు సూచించారు. డాక్టర్ల సూచనలతో మణిపాల్ హాస్పిటల్ లో మంత్రి అడ్మిట్ అయ్యారు.
రేపు ఉదయం మంత్రి వేణుకి డాక్టర్లు వైద్య పరీక్షలు చేయనున్నారు. మంత్రి వేణు ఆసుపత్రిలో చేరినట్లు తెలిసి వైసీపీ నేతలు, కార్యకర్తలు, ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. దీనిపై మంత్రి కార్యాలయవర్గాలు స్పందించాయి. మంత్రి వేణు ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాయి.
Also Read : చంద్రబాబుకు 175 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు ఉన్నారా? : సజ్జల సెటైర్లు
మంత్రి వేణు ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలపై ఆయన కుమారుడు చెల్లుబోయిన నరేన్ స్పందించారు. ఒక ప్రకటన విడుదల చేశారు. ”మంత్రి వేణు ఆరోగ్యం బాగానే ఉంది. టీవీల్లో చూపిస్తున్నట్లుగా గుండె జబ్బు కాదు. కేవలం స్వల్ప అస్వస్థత మాత్రమే. రేపు ఇంటికి వచ్చేస్తారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు” అని చెల్లుబోయిన నరేన్ స్పష్టం చేశారు.