Minister Gudivada Amarnath: పవన్ కళ్యాణ్ అలా ఎప్పుడైనా చెప్పారా..? జనసేన అధినేతపై మంత్రి ఘాటు వ్యాఖ్యలు

విశాఖ వేదికగా పవన్ కళ్యాణ్ అసత్యాలు మాట్లాడారు. వారాహి అనే లారీ ఎక్కి కేవలం ముఖ్యమంత్రిని తిడుతున్నాడని మంత్రి అమర్నాథ్ అన్నారు.

Minister Gudivada Amarnath: పవన్ కళ్యాణ్ అలా ఎప్పుడైనా చెప్పారా..? జనసేన అధినేతపై మంత్రి ఘాటు వ్యాఖ్యలు

Minister Gudivada Amarnath

Updated On : August 11, 2023 / 10:27 AM IST

Gudivada Amarnath: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మూడో విడత వారాహి యాత్ర (Varahi Yatra) విశాఖపట్టణం (Visakhapatnam) లో గురువారం ప్రారంభమైంది. యాత్రలో భాగంగా రాత్రి జగదాంబ సెంటర్‌లో బహిరంగ సభలో పవన్ మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌మోహన్ రెడ్డి (cm jagan mohan reddy) పై సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి కారణం జగన్ అని అన్నారు. దానికి కారణాలను పవన్ వివరించారు. జగన్, వాళ్ల గుంపు తెలంగాణలో భూములు దోచుకుంది. అందుకే అక్కడ తరిమేశారు. ఆంధ్రకి పొమ్మన్నారు. ఇక్కడ రుషికొండ, ఎర్రమట్టి దిబ్బలు, సహజవనరులుకూడా దోచుకుంటున్నారని పవన్ ఫైర్ అయ్యారు. అంతేకాదు.. కేంద్రంతో నిన్ను ఆడిస్తా చూడు అంటూ జగన్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. జగన్‌ను ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు.

Pawan Kalyan : తెలంగాణ రావడానికి కారణం జగనే, అందుకే ఆంధ్రోళ్లను తన్ని తరిమేశారు- పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు, కేంద్రంతో నిన్ను ఓ ఆట ఆడిస్తానని వార్నింగ్

మంత్రి గుడివాడ అమర్నాథ్ ( Minister Gudivada Amarnath ) మాట్లాడుతూ.. విశాఖ వేదికగా పవన్ కళ్యాణ్ అసత్యాలు మాట్లాడారని అన్నారు. వారాహి అనే లారీ ఎక్కి కేవలం ముఖ్యమంత్రిని తిడుతున్నాడని, పవన్ కళ్యాణ్ అనే అమాయకుడిని చూసి జాలిపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్‌కు, జగన్ మోహన్‌రెడ్డికి మధ్య వ్యత్యాసం వేమన ఎప్పుడో చెప్పారంటూ మంత్రి వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్‌కు స్థిరత్వం, సిద్ధాంతం లేదు. పవన్ సంసారం జేపీతో, సహజీవనం టీడీపీతో చేస్తున్నాడు.

KA Paul : బీజేపీలో జనసేన విలీనం, 5వేల కోట్లకు బేరం- చిరంజీవి, పవన్ కల్యాణ్‌పై కేఏ పాల్ సంచలనం

మేము అధికారంలోకి వస్తే ప్రజలకు పలానా పథకాలను తీసుకొస్తామని, పలానా అభివృద్ధి పనులు చేపడతాం అని పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా చెప్పారా అంటూ మంత్రి ప్రశ్నించారు. పవన్‌కు పొలిటికల్ నిర్మాత చంద్రబాబు. ఆయన చెప్పినట్లు పవన్ మాట్లాడతాడు అంటూ అమర్నాథ్ విమర్శించారు. ప్రజలు జగన్ మోహన్ రెడ్డి వెంట ఉన్నారు. పవన్ లాంటివారు ఎన్ని కుట్రలు చేసినా మళ్లీ వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రజలు సిద్ధమయ్యారని మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు.