ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
కుప్పం ఆర్థికాభివృద్ధి, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.

Ap Cabinet Key Decisions : ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపింది. 2014-18 మధ్య నీరు, చెట్టు పెండింగ్ బిల్లుల చెల్లింపులు, పనులు ప్రారంభించాలని నిర్ణయించింది. అలాగే ఏపీ జీఎస్టీ 2024 చట్ట సవరణకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఇక ఏపీ ఎక్సైజ్ చట్ట సవరణ ముసాయిదాకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
కుప్పం ఆర్థికాభివృద్ధి, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. పిఠాపురం ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ ఏర్పాటు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఇక, సీఆర్డీఏ పరిధిని 8వేల 352 చదరపు కిలోమీటర్లకు పెంచాలని కేబినెట్ నిర్ణయించింది.
క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
* ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ 2024కు ఆమోదం
* ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 1982 రివీల్ బిల్లుకు ఆమోదం
* 2014, 18 మధ్య నీరు, చెట్టు పెండింగ్ బిల్లుల చెల్లింపులు, పనులు ప్రారంభించాలని నిర్ణయం
* ఏపీ జీఎస్టీ 2024 చట్ట సవరణకు ఆమోదం
* ఏపీ ఎక్సైజ్ చట్ట సవరణ ముసాయిదాకు ఆమోదం
* కుప్పం ఆర్థికాభివృద్ధి, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు ఆమోదం
* పిఠాపురం ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ ఏర్పాటు చేయాలని క్యాబినెట్ నిర్ణయం
* సీఆర్డీఏ పరిధిని 8వేల 352 చదరపు కిలోమీటర్లకు పెంచాలని నిర్ణయం
* పల్నాడు, బాపట్లలోని 11 మండలాల్లో 154 గ్రామాలను మళ్లీ సీఆర్డీఏ పరిధిలోకి తేవాలని నిర్ణయం
* ఏపీలో జ్యుడిషియల్ అధికారులకు ఉద్యోగ విరమణ వయసు 61కి పెంపు
* 2024 నవంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చేలా చట్ట సవరణ బిల్లుకు ఆమోదం
* డేటా సెంటర్ పాలసీ 4.O కు ఆమోదం
Also Read : చంద్రబాబులో మళ్లీ 95 నాటి సీఎంను చూస్తామా?