Merugu Nagarjuna : 2024లో చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయం- మంత్రి జోస్యం
చంద్రబాబు, లోకేశ్ ఎక్కడ పుట్టి ఎక్కడ నుంచి ఎన్నికల బరిలో నిలుస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం మా నాయకుడు మమ్మల్ని ఎక్కడి నుండైనా రంగంలోకి దింపుతారు. మీరెవరు మమ్మల్ని అడగటానికి? అని విరుచుకుపడ్డారు.

Minister Merugu Nagarjuna Slams Chandrababu Naidu (Photo : Google)
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై నిప్పులు చెరిగారు మంత్రి మేరుగు నాగార్జున. 2024లో టీడీపీ చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయం అన్నారాయన. ఇక, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, చంద్రబాబు భేటీపైనా మంత్రి తీవ్రంగా స్పందించారు. నాడు బీహారోడి వల్ల ఏమవుతుంది అన్న చంద్రబాబుకు ఈరోజు పీకే అవసరం గుర్తుకు వచ్చిందా? అని నిలదీశారు. అవకాశం ఉన్నప్పుడు ఎగ్గిచ్చి తన్నడం అవకాశం లేనప్పుడు మాత్రం తెచ్చి పెట్టుకోవడం చంద్రబాబు నైజం అని విమర్శించారు. పీకే ఏమైన ఓట్లను మార్పిస్తాడా? అని అడిగారాయన. ఏపీ ప్రజలంతా జగన్ వెంటే ఉన్నారని స్పష్టం చేశారు.
2024లో చంద్రబాబు చిత్తుచిత్తుగా ఓడిపోబోతున్నాడు అని జోస్యం చెప్పారు. టీడీపీ రథచక్రాలు ఊడిపోబోతున్నాయని అన్నారు. మమ్మల్ని మార్చారని అడగడానికి చంద్రబాబు, లోకేశ్ ఎవరు అని మంత్రి నాగార్జున ధ్వజమెత్తారు. చంద్రబాబు, లోకేశ్ ఎక్కడ పుట్టి ఎక్కడ నుంచి ఎన్నికల బరిలో నిలుస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం మా నాయకుడు మమ్మల్ని ఎక్కడి నుండైనా రంగంలోకి దింపుతారు. మీరెవరు మమ్మల్ని అడగటానికి? అని విరుచుకుపడ్డారు.
Also Read : అవును అప్పులు చేయాల్సిందే..! సీఎం జగన్ సరికొత్త వ్యూహం, తొలిసారి టీడీపీ ఆరోపణలకు కౌంటర్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ చంద్రబాబు దగ్గర ప్రైవేటుగా అప్పు తెచ్చుకొని ప్రజలను మోసం చేసిన వ్యక్తి అని విమర్శించారు. అలాంటి వ్యక్తికి ఏపీ అప్పుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఎంపీ ఆశీస్సుల కోసమే మాగుంటను కలిశానని మేరుగ నాగార్జున తెలిపారు. మాట్లాడితే చాలు ఎర్ర పుస్తకం రాశానంటున్న లోకేశ్.. దాన్ని మడత పెట్టి దాచిపెట్టుకో అని విమర్శించారు. మేము పెట్టిన మ్యానిఫెస్టోను దేశంలోని ఇతర రాష్ట్రాలు అమలు పరుస్తున్నాయని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంపై జగన్ నిర్ణయమే పైనల్ అని మంత్రి మేరుగ నాగార్జున తేల్చి చెప్పారు.
Also Read : ఆ ముగ్గురు మాత్రమే సేఫ్..! 10మందిపై వేటు ఖాయం..! అనంత వైసీపీ ఎమ్మెల్యేలలో టెన్షన్ టెన్షన్