Ap Inter Result 2025: రేపే ఇంటర్ రిజల్ట్స్.. ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి..

ఏపీ ఇంటర్ ఫలితాలు శనివారం విడుదల కనున్నాయి. ఉదయం 11గంటలకు మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేయనున్నారు.

Ap Inter Result 2025: రేపే ఇంటర్ రిజల్ట్స్.. ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి..

AP Inter results

Updated On : April 11, 2025 / 5:03 PM IST

Ap Inter Result 2025: ఏపీ ఇంటర్ పరీక్షల ఫలితాలు రేపు (ఏప్రిల్ 12) విడుదల కనున్నాయి. శనివారం ఉదయం 11గంటలకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఈసారి ఫలితాలను మన మిత్ర వాట్సాప్ నవంబర్ 9552300009 ద్వారా కూడా వెల్లడించడం జరుగుతుందని చెప్పారు. వాట్సాప్ నెంబర్ కు “హాయ్” సందేశాన్ని పంపడం ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చునని నారా లోకేశ్ తెలిపారు. ఈ సందర్భంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులకు లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. మీ కృషి రేపటి ఫలితాల్లో ప్రతిబింబించాలి.. ఉజ్వల భవిష్యత్తుకు తలుపులు తెరవాలని లోకేశ్ ఆకాంక్షించారు.

ఏపీలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు మార్చి 1 నుంచి 19వ తేదీ వరకు జరగ్గా.. ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు మార్చి 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరిగాయి. పేపర్ల వాల్యుయేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది. దీంతో ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 12వ తేదీన ఫలితాలు విడుదల చేసేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శనివారం ఉదయం 11గంటలకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలు వెల్లడించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు ఈసారి ఫలితాలను వాట్సాప్ ద్వారా కూడా వెల్లడించనుంది. ఫలితాలు విడుదలైన తరువాత విద్యార్థులు వాట్సాప్ నెం. 9552300009 ద్వారా లేదా.. అధికారిక వెబ్‌సైట్‌ https://resultsbie.ap.gov.in/ ద్వారా లేదా 10tv.in  వెబ్ సైట్ లోనూ ఫలితాలను తెలుసుకోవచ్చు.

వాట్సాప్ ద్వారా..
♦ ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009కు హాయ్ అని మెసేజ్ పెట్టాలి.
♦ సెలెక్ట్ సర్వీస్ లో విద్యా సేవలు ఆప్షన్ ను ఎంచుకోవాలి.
♦ డౌన్ లోడ్ ఏపీ ఇంటర్ ఫలితాలు 2025ను ఎంచుకోవాలి.
♦ హాట్ టికెట్ నెంబర్ ను ఎంటర్ చేసి మెమో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.