కూటమి ప్రభుత్వంలో తిరుమలలో అన్నీ శాస్త్రీయ పద్ధతిలో జరుగుతున్నాయి- కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
ఇలా ఎప్పటి నుంచో సమస్యలుగా ఉన్నటువంటి అన్నింటిని పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది.

Ram Mohan Naidu Kinjarapu : కూటమి ప్రభుత్వంలో తిరుమలలో అన్నీ శాస్త్రీయ పద్దతిలో జరుగుతున్నాయని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఇవాళ కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు వెళ్తున్నాయన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చాక ప్రక్షాళన జరిగిందని చెప్పారాయన. శ్రీవారి భక్తులు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. 2వేల 245 కోట్ల రూపాయలతో అమరావతికి 55 కిలోమీటర్ల పొడవున రైల్వే లైన్ మంజూరైందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.
”అమరావతికి సంబంధించి ప్రత్యేక రైల్వే లైన్ 2వేల కోట్ల రూపాయలతో 55 కిలోమీటర్ల పొడవు.. కృష్ణా నది మధ్యలో వస్తుంది. దాని మీద 3.3 కిలోమీటర్ల వంతెన కూడా ఏర్పాటు చేయనున్నారు. నిన్ననే క్యాబినెట్ ఆమోదం కూడా పొందడం జరిగింది. అలాంటి కార్యక్రమాలు ఈ 4 నెలల కాలంలో ఎన్నో చేశాం. అమరావతికి సుమారు 15వేల కోట్ల రూపాయలు, పోలవరానికి 12వేల 200 కోట్ల రూపాయలు, రైల్వే జోన్ కి కావాల్సిన ల్యాండ్ ను కూడా మంజూరు చేసుకుని అన్ని అప్రూవల్స్ కూడా తీసుకున్నాం.
ఇలా ఎప్పటి నుంచో సమస్యలుగా ఉన్నటువంటి అన్నింటిని పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, అందుకు రాష్ట్రానికి సహాయ సహకారాలు అందించాలని ప్రధాని మోదీ కూడా చెప్పారు. రాష్ట్రంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు నడుస్తున్నాయి. పౌర విమానయాన శాఖ నుంచి కూడా డ్రోన్ సమ్మిట్ ఒకటి చేశాం. విజయవాడలో కృష్ణా నది తీరాన చాలా అద్భుతంగా జరిగింది డ్రో షో. 5 గిన్నిస్ రికార్డులు కూడా సాధించడం జరిగింది. ఓర్వకల్లులో 300 ఎకరాలు డ్రోన్ సిటీ కూడా ఏర్పాటు చేశాం” అని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.
Also Read : నామినేటెడ్ పోస్టుల భర్తీపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్.. సెకండ్ లిస్టులో 40మందికి ఛాన్స్..!