AP : ఆరోగ్యకరమైన గ్రామాలే లక్ష్యం: సర్పంచ్‌లతో మంత్రి పెద్దిరెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌

ఏపీ పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గ్రామ సర్పంచ్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో గ్రామాల్లో విప్లవాత్మక మార్పుల్ని తీసుకొచ్చారని..ఆరోగ్యకరమైన గ్రామాలే లక్ష్యం పనిచేస్తున్నారని అన్నారు. రాష్ట్రమంతటా గ్రామాల్లో "జగనన్న స్వచ్ఛ సంకల్పం" అమలుపై సర్పంచ్ లతో మంత్రి చర్చించారు.

AP : ఆరోగ్యకరమైన గ్రామాలే లక్ష్యం: సర్పంచ్‌లతో మంత్రి పెద్దిరెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌

Minister Peddi Reddy

Updated On : June 14, 2021 / 1:50 PM IST

Jagananna swachha sankalpam : ఏపీ పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గ్రామ సర్పంచ్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో గ్రామాల్లో విప్లవాత్మక మార్పుల్ని తీసుకొచ్చారని..ఆరోగ్యకరమైన గ్రామాలే లక్ష్యం పనిచేస్తున్నారని అన్నారు. రాష్ట్రమంతటా గ్రామాల్లో “జగనన్న స్వచ్ఛ సంకల్పం” అమలుపై సర్పంచ్ లతో మంత్రి చర్చించారు. జూలై 8న జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారని..జగనన్న స్వచ్ఛ సంకల్పం కోసం రూ.1312.04 కోట్లు కేటాయించామని..ఆ నిధులతో ఆరోగ్యకరమైన గ్రామాలను తీర్చి దిద్దుతామని తెలిపారు. సర్పంచ్‌లంతా గ్రామసచివాలయ వ్యవస్థను ఉపయోగించుకోవాలని సూచించారు.

ఆరోగ్యకరమైన గ్రామాలే లక్ష్యం కోసం సీఎం శ్రీకారం చుట్టారనీ.. ‘‘గ్రామ సర్పంచ్‌లు ఈ కార్యక్రమం ద్వారా వారి పంచాయితీలను స్వచ్ఛ పల్లెలుగా తీర్చి దిద్దాలని పిలుపునిచ్చారు. సర్పంచ్ లో భాగస్వామ్యంతోనే పల్లెలు సరికొత్త పల్లెలుగా మారతాయని..ప్రజలు ఆరోగ్యంగా ఉండేలా చూడాలని తెలిపారు.

ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసి ప్రజలు లబ్ది పొందేలా సర్పంచ్ లు చూసుకోవాలన్నారు. పట్టణాలకు ఏమాత్రం తీసిపోకుండా పల్లెలను తీర్చిదిద్ది అభివృద్ది బాటలో పయనించేలా ప్రభుత్వం సహకారంతో ఈ పనులు చేయాలని సూచించారు. ప్రతిగ్రామం పరిశుభ్రత, పచ్చదనంతో కళకళలాడాలని ఇది సీఎం జగన్ ఆకాంక్ష అనీ..స్వచ్ఛసంకల్ప కార్యక్రమాల్లో ప్రజలంతా భాగస్వాములు అయ్యి వారి పల్లెల పరిశుభత్రలో పాలు పంచుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి పిలుపునిచ్చారు.