బాలికపై అత్యాచారం: దిశ చట్టం అమల్లోకి వచ్చిన రోజే వెలుగులోకి దారుణం

  • Published By: vamsi ,Published On : December 13, 2019 / 12:12 PM IST
బాలికపై అత్యాచారం: దిశ చట్టం అమల్లోకి వచ్చిన రోజే వెలుగులోకి దారుణం

Updated On : December 13, 2019 / 12:12 PM IST

గుంటూరులోని రామిరెడ్డి నగర్‌లో మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు ఇంటర్ చదివే విద్యార్థి. ఇంట్లో ఆడుకుంటున్న పాపపై లక్ష్మణరెడ్డి ఇంటర్ చదివే యువకుడు అత్యాచారం చేశాడు. బాలిక ఇంట్లో పై పోర్షన్ లో ఉంటున్న ఇంటర్మీడియట్ విద్యార్థి లక్ష్మణరెడ్డి బాలికపై డిసెంబర్ 10వ తేదీ అత్యాచారం చేసినట్లుగా తెలుస్తుంది.

పాప అనారోగ్యంగా తో ఉండడంతో అనుమానించిన తల్లిదండ్రులు ఆరా తీయగా ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో నగర పాలెం పోలీస్ స్టేషనులో తల్లి ఫిర్యాదు చేసింది. కేసునమోదు చేసిన పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల కోసం బాలికను గుంటూరు జిజిహెచ్ ఆసుపత్రికి తరలించారు.

దిశ చట్టం అసెంబ్లీలో అమలులోకి వచ్చిన రోజే ఘటన వెలుగులోకి రాగా మహిళలపై, ఆడపిల్లలపై అఘాయిత్యాలు చేస్తే ఊరుకునేది లేదని ప్రకటించిన సీఎం జగన్ మాటల మేరకు కేసును త్వరితగతిన పరిష్కరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇక దిశ చట్టం కింద నమోదయ్యే తొలి కేసు ఇదే కావచ్చు.