Anil Kumar : లోకేష్ దొంగలా తప్పించుకుని తిరుగుతుంటే.. సీఐడీ అధికారులు పట్టుకుని నోటీసులిచ్చారు : ఎమ్మెల్యే అనిల్

చంద్రబాబు చేసిన ద్రోహం టీడీపీ నేతలకు కూడా కనిపిస్తుందన్నారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రమే మనస్ఫూర్తిగా బాధపడుతూ ఉన్నారని ఎమ్మెల్యే అనిల్ ఏద్దేవా చేశారు.

Anil Kumar : లోకేష్ దొంగలా తప్పించుకుని తిరుగుతుంటే.. సీఐడీ అధికారులు పట్టుకుని నోటీసులిచ్చారు : ఎమ్మెల్యే అనిల్

MLA Anil Kumar Yadav

Anil Kumar – Lokesh : సీఐడీ అధికారులకు దొరక్కుండా నారా లోకేష్ దొంగలాగా తప్పించుకుని తిరుగుతూ ఉంటే అధికారులు పట్టుకుని నోటీస్ లు ఇచ్చారని ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. సీఐడీ తనను కూడా అరెస్ట్ చేయబోతోందని మాజీ మంత్రి నారాయణకి తెలుసని అన్నారు. చంద్రబాబు, నారాయణ విచారణకు సహజరించకూడదని మాట్లాడుకునేందుకు జైలులో బాబుకు కలిశారని పేర్కొన్నారు. నారాయణ స్టూడెంట్స్ తల్లిదండ్రుల రక్తం పీల్చుకునే దుర్మార్గుడు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

రూ.800 కోట్ల విలువ చేసే పేదల భూములను కొట్టేసిన నువ్వు సత్య హరిచంద్రుడివా అంటూ నిలదీశారు. నారాయణ, చంద్రబాబు చరిత్ర ఏంటో రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. టీడీపీ నేతలు గంటలు కొట్టడం దేవుడి స్క్రిప్ట్.. ముద్రగడకి చేసిన అన్యాయం గుర్తు వచ్చిందన్నారు. నవ్వుతూ నిరసనలు తెలపడం, గంటలు కొట్టడం అదొక ఆందోళన అంటారా..? అందరూ నవ్వుతూ చేస్తున్నారు.. బాధ అస్సలు కనిపించడం లేదు అని అన్నారు.

Nara Bhuvaneshwari : ఏపీ వ్యాప్తంగా నారా భువనేశ్వరి బస్సు యాత్ర?

చంద్రబాబు చేసిన ద్రోహం టీడీపీ నేతలకు కూడా కనిపిస్తుందన్నారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రమే మనస్ఫూర్తిగా బాధపడుతూ ఉన్నారని ఎమ్మెల్యే అనిల్ ఏద్దేవా చేశారు. ముద్రగడను, ఆయన కుటుంబ సభ్యులను చిత్ర హింసలు పెట్టీ.. ఇబ్బందులు పెట్టిన విషయం టీడీపీ నేతలకు గుర్తు లేదా అని నిలదీశారు. లోకేష్ ఒక పులకేశి.. ఢిల్లీలో లాయర్స్ తో మాట్లాడుతూ ఉన్నాడని టీడీపీ నేతలు బిల్డప్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు.