MLA Roja : మీ ఆడిబిడ్డగానే చావాలని డిసైడయ్యాను : ఎమ్మెల్యే రోజా

వైసీపీ శ్రేణులతో కలిసి ఉండేందుకే నగరిలోనే ఇల్లు కట్టుకుని ఉంటున్నట్టు చెప్పారు. మీ ఆడబిడ్డగానే ఇక్కడే చావాలని డిసైడ్ అయ్యానని అన్నారు.

MLA Roja : మీ ఆడిబిడ్డగానే చావాలని డిసైడయ్యాను : ఎమ్మెల్యే రోజా

Roja (1)

Updated On : February 6, 2022 / 8:07 PM IST

MLA Roja clarified : వైసీపీపై అలక వహించినట్టు వస్తున్న వార్తలపై చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా క్లారిటీ ఇచ్చారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు, పార్టీ మారుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. తాను రాజీనామా చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. తప్పు చేసిన వారు రాజీనామా చేయాలని పేర్కొన్నారు.

వైసీపీ శ్రేణులతో కలిసి ఉండేందుకే నగరిలోనే ఇల్లు కట్టుకుని ఉంటున్నట్టు చెప్పారు. మీ ఆడబిడ్డగానే ఇక్కడే చావాలని డిసైడ్ అయ్యానని అన్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేని చేసిన సీఎం జగన్‌కు రుణపడి ఉంటానని చెప్పారు.

Road Accident : పెళ్లి వేడుకకు వెళ్లొస్తుండగా విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఒకే ఫ్యామిలీకి చెందిన 8 మంది మృతి

శ్రీశైలం ఆలయ పాలకమండలిని ఖరారు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. శ్రీశైలం పాలకమండలి ఛైర్మన్‌గా రెడ్డివారి చక్రపాణిరెడ్డి నియమించింది. చక్రపాణిరెడ్డి ఛైర్మన్‌గా 15 మంది సభ్యులతో పాలకమండలి ఖరారు చేసింది. తన వైరి వర్గానికి కీలక పదవులు రావడంతో నగరి ఎమ్మెల్యే రోజా అలకబూనినట్లు వార్తలు వచ్చాయి.

అయితే కీలకమైన ఛైర్మన్‌ పదవిని రెడ్డివారి చక్రపాణిరెడ్డికి ఇవ్వడంతో రోజా మనస్తాపానికి గురైనట్లు తెలిసింది. చక్రపాణిరెడ్డితో కొంతకాలంగా రోజాకు విభేదాలు కొనసాగుతున్నాయి. గతంలో ఈ విషయాన్ని రోజా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే.

Tirumala : శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే సర్వదర్శనం ప్రారంభం

ఆలయ ఛైర్మన్‌ పదవిని చక్రపాణిరెడ్డికి ఇవ్వొద్దని రోజా గతంలోనే అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. అయితే చక్రపాణిరెడ్డికే ఆలయ ఛైర్మన్‌ పదవిని కేటాయించడంతో రోజా మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. తన మాట లెక్క చేయకుండా చక్రపాణి రెడ్డికి పదవి ఇవ్వడంతో ఆమె అలకబూనినట్లు వార్తులు వచ్చాయి.

కానీ వైసీపీపై అలక వహించినట్టు వస్తున్న వార్తలపై ఎమ్మెల్యే రోజా స్పష్టత ఇచ్చారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు, పార్టీ మారుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. తాను రాజీనామా చేయాల్సిన అవసరం లేదని చెప్పారు.