MLA Roja: “పొత్తులతో కాదు సింగిల్‌గా పోటీ చేయాలి”

అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మాట్లాడిన ఎమ్మెల్యే రోజా.. టీడీపీ లీడర్ నారా లోకేశ్ 'అమ్మ ఒడి ఒక అబద్ధం' అని చేసిన కామెంట్ పై విమర్శలు చేశారు. లోకేశ్ ను 'పప్పు నాయుడు' అని సంభోదిస్తూ..

MLA Roja: “పొత్తులతో కాదు సింగిల్‌గా పోటీ చేయాలి”

Mla Roja

Updated On : March 25, 2022 / 1:34 PM IST

MLA Roja: అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మాట్లాడిన ఎమ్మెల్యే రోజా.. టీడీపీ లీడర్ నారా లోకేశ్ ‘అమ్మ ఒడి ఒక అబద్ధం’ అని చేసిన కామెంట్ పై విమర్శలు చేశారు. లోకేశ్ ను ‘పప్పు నాయుడు’ అని సంభోదిస్తూ.. అమ్మ ఒడి వస్తుందా.. రావడం లేదా అని పిల్లల తల్లులని అడిగితే తెలుస్తుందని, పక్క రాష్ట్రాల్లో అమలు చేసేంత ఆదర్శప్రాయంగా అమలవుతుందని చెప్పారు.

‘చంద్రబాబు అమలుచేసిన పథకాలను పక్క రాష్ట్రాల్లో ఎవరైనా అనుసరించారా.. సీఎం జగన్‌కు చంద్రబాబుకు చాలా తేడా ఉంది. మహిళల గురించి మాడ్లాడే అర్హత టీడీపీకి లేదు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు తొలి సంతకం బెల్టు షాపులు తొలగించడంపైనే అని అన్నారు. ఆయన పదవీ కాలం పూర్తయ్యేసరికి 43 వేల బెల్టు షాపులున్నాయి. అలాంటి వ్యక్తి మద్యం గురించి మాట్లాడుతున్నారా..’

‘మందు బాబుల కోసం ఉద్యమాలు చేసే దిక్కుమాలిన పార్టీ టీడీపీ. సీఎం జగన్ హయాంలో మద్యం షాపులు తగ్గుతుంటే చంద్రబాబు మాత్రం మద్యం తాగమంటూ రెచ్చగొడుతున్నారు. చీప్‌లిక్కర్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు. చంద్రబాబు రాష్ట్రానికి ప్రమాదకరం’

Read Also: వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను-రోజా

‘సంక్షేమ పథకాలకు బ్రాండ్ అంబాసిడర్ జగన్. 26 జిల్లాల్లో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరిగేలా కృషి చేస్తున్నారు సీఎం. ఏ పార్టీ అయినా పొత్తులతో కాకుండా సింగిల్‌గా పోటీ చేయాలి’ అంటూ సవాల్ విసిరారు ఎమ్మెల్యే రోజా.