MLC Sheikh Sabji : యాక్సిడెంట్ కాదు మర్డర్..? ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంపై కుటుంబసభ్యుల అనుమానాలు

ఈ ఘటనపై సీబీసీఐడీ ఎంక్వైరీ వేయాలని, తమకు న్యాయం చేయాలని సాబ్జీ కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు.

MLC Sheikh Sabji : యాక్సిడెంట్ కాదు మర్డర్..? ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంపై కుటుంబసభ్యుల అనుమానాలు

MLC Sheikh Sabji

Updated On : December 15, 2023 / 8:47 PM IST

పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం తీవ్ర విషాదం నింపింది. సాబ్జీ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. అయితే, రోడ్డు ప్రమాదంలో సాబ్జీ చనిపోవడంపై కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు ప్రమాదం కాదు హత్య అని సందేహాలు కనబరుస్తున్నారు.

షేక్ సాబ్జీ మరణం ప్రమాదం కాదు హత్య అని సాబ్జీ కొడుకు, సోదరుడు ఆరోపణలు చేశారు. రాబోయే ఎన్నికల ముందు ఉపాధ్యాయులకు మద్దతుగా ఉండే ఎమ్మెల్సీని అంతమొందించారని ఆరోపించారు కుటుంబసభ్యులు.

Also Read : ప్ర‌ముఖ యూట్యూబ‌ర్ చంద్ర‌శేఖ‌ర్ సాయి కిర‌ణ్ అరెస్ట్.. కార‌ణం తెలిస్తే షాక్..!

గతంలో కూడా సాబ్జీ హత్యకు కుట్ర పన్నారని చెప్పారు. 140 కిలోమీటర్ల వేగంతో వచ్చి సాబ్జీ ప్రయాణిస్తున్న కారును ఢీకొన్నట్లు పోలీసులే చెబుతున్నారు అని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ఘటనపై సీబీసీఐడీ ఎంక్వైరీ వేయాలని, తమకు న్యాయం చేయాలని సాబ్జీ కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు. ప్రమాదం కాదు హత్య అన్న కోణంలో పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు ఎమ్మెల్సీ సోదరుడు ఫరీద్ కాశీం.

మరోవైపు ఎమ్మెల్సీ సాబ్జీ పార్థివదేహం పట్ల భీమవరం ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం బట్టబయలైంది. పోస్టుమార్టం అనంతరం అంబులెన్స్ లో ఎక్కిస్తుండగా సాబ్జీ మృతదేహం నుండి తీవ్ర రక్తస్రావమైంది. పోస్టుమార్టం తర్వాత సరిగ్గా కుట్లు వేయకపోవడం వల్లే రక్తస్రావం అంటూ కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో మళ్లీ మృతదేహాన్ని ఆసుపత్రిలోకి తీసుకెవెళ్లారు భీమవరం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు. మరోసారి కుట్లు వేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Also Read : మహదేవ్ యాప్ కేసులో సినీనటుడు సాహిల్ ఖాన్‌తోపాటు ముగ్గురికి సమన్లు

ఏలూరు నుంచి భీమవరం వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఉండి మండలం చెరుకువాడ సమీపంలో రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ఆయన చనిపోయారు. అంగన్ వాడీ వర్కర్ల సమ్మెలో పాల్గొని వెళ్తుండగా ఈ యాక్సిడెంట్ సంభవించింది. షేక్ సాబ్జీ మృతి పట్ల పార్టీలకు అతీతంగా నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.