తిరుమలలో దర్శనాలు ప్రస్తుతానికి లేనట్టే – టీటీడీ చైర్మన్

దేశవ్యాప్తంగా మే 31 వరకు లాక్ డౌన్ అమల్లో ఉన్నందున తిరుమల శ్రీవారి దర్శనాలు ఎప్పడు ప్రారంభిస్తామో చెప్పలేమని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. గత 60 రోజులుగా లాక్ డౌన్ ఉన్నందున భక్తులకు స్వామివారి దర్శనం కల్పించలేక పోయామని ..భక్తులకు స్వామి వారి ఆశీస్సులు ఉండాలనే ఉద్దేశ్యంతోనూ… శ్రీవారి దర్శనం ప్రారంభమయ్యేంత వరకూ లడ్డూ ప్రసాదాలు విక్రయిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ప్రతిరోజు 3 నుంచి 4 లక్షల లడ్డూలు వరకూ తయారు చేస్తున్నామని భక్తులకు రూ.25 లకే లడ్డూ విక్రయిస్తున్నట్లు ఆయన చెప్పారు. టీటీడీ సమాచార కేంద్రాలు, టీటీడీ కల్యాణ మండపాల్లో లడ్డూ విక్రయాలు జరుగుతున్నాయన్నారు.
ప్రత్యేక ఆర్డర్‌పై స్వామి వారి లడ్డూలు పంపిణీ జరుగుతుందని సుబ్బారెడ్డి పేర్కొన్నారు.మరిన్ని ఎక్కువ లడ్డూలు కావాల్సిన భక్తులు ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్(9849575952), పేష్కార్ శ్రీనివాస్(9701092777)లను సంప్రదించాలని టీటీడీచైర్మన్ తెలిపారు. మే 22 నుంచి భక్తులు కోరినన్ని లడ్డూలు అందించనన్నట్లు ఆయన తెలిపారు.
స్వామి వారికి 2019 ఆర్ధిక సంవత్సరంలో హుండీ ద్వారా రూ.1.79 కోట్ల ఆదాయం రాగా ఈ ఏడాది ఇప్పటి వరకు రూ,1.97 కోట్లు ఆదాయం వచ్చిందని సుబ్బారెడ్డి తెలిపారు.
Read:తెలంగాణలో ప్రాజెక్టుల వివరాలు ఇవ్వాలని కేఆర్ఎంబీ లేఖ