బీకేర్‌ఫుల్ : 40ఏళ్లు దాటినవారిలో కరోనా హైరిస్క్ ఎక్కువ!

  • Published By: srihari ,Published On : June 19, 2020 / 02:17 PM IST
బీకేర్‌ఫుల్ : 40ఏళ్లు దాటినవారిలో కరోనా హైరిస్క్ ఎక్కువ!

Updated On : June 19, 2020 / 2:17 PM IST

కరోనా బారిన పడకుండా 40 ఏళ్లు పైబడిన హైరిస్క్ గ్రూపు వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ కేఎస్‌ జవహర్ రెడ్డి సూచించారు. ఆస్తమా, ఊపిరితిత్తులు సంబంధింత సమస్యలు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కేవలం జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలే కాకుండా ఊపిరి తీసుకోవడంలో ఏమాత్రం ఇబ్బందులున్నా తక్షణమే వైద్యులను సంప్రదించాలన్నారు.

‘104’ టోల్‌ ఫ్రీ నంబర్‌, వైఎస్సార్‌ టెలీ మెడిసిన్‌ ‘14410’ నంబర్‌కు ఫోన్‌ చేయాలని సూచించారు. స్థానిక ఆశా వర్కర్‌, వార్డు వాలంటీర్‌కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఆస్తమా, ఆయాసం అశ్రద్ధ చేయొద్దని జవహర్‌రెడ్డి సూచనలు చేశారు. బీపీ, షుగర్, గుండె జబ్బులు ఉన్నవారితో పాటు, హైరిస్క్ గ్రూపుకు చెందినవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

శ్వాసలో ఏమాత్రం ఇబ్బందులున్నా కొవిడ్ కేర్ సెంటర్‌లో వెంటనే సంప్రదించాలన్నారు. అవసరమైతే ఐసోలేషన్‌కు తరలిస్తారని తెలిపారు. ఏపీలో కరోనా సోకినవారిలో 40ఏళ్ల నుంచి 49 ఏళ్ల మధ్య వయస్సున్న వారు 14 మంది ఉన్నారు. 50ఏళ్ల నుంచి 59ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు 22 మంది మరణించారని జవహర్‌రెడ్డి తెలిపారు.