Girl Killed : ప్రేమ పెళ్లి చేసుకుంటానన్న యువతిని హత్య చేసిన తల్లి, అన్న

కోమల(17) అనే బాలిక పెద్దలు చూసిన సంబంధం కాకుండా నచ్చిన వాడిని చేసుకుంటానంటూ కుటుంబ సభ్యులతో గొడవ పడింది. కుమార్తె పెళ్లి చేసే విషయంలో కుటుంబ సభ్యల మధ్య గొడవ జరిగింది.

Girl Killed : ప్రేమ పెళ్లి చేసుకుంటానన్న యువతిని హత్య చేసిన తల్లి, అన్న

mother and brother killed girl

Updated On : November 8, 2023 / 11:22 AM IST

Anantapur Girl Killed : ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గార్లదిన్నె మండలం కోటంక గ్రామంలో పరువు హత్య జరిగింది. ప్రేమ పెళ్లి చేసుకుంటానన్న యువతిని తల్లి, అన్న కలిసి హత్య చేశారు. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటానంటున్న యువతిని ఆమె తల్లి, అన్న కలిసి చంపేశారు.

గార్లదిన్నె మండలం కోటంక గ్రామంలో కోమల(17) అనే బాలిక పెద్దలు చూసిన సంబంధం కాకుండా నచ్చిన వాడిని చేసుకుంటానంటూ కుటుంబ సభ్యులతో గొడవ పడింది. కుమార్తె పెళ్లి చేసే విషయంలో కుటుంబ సభ్యల మధ్య గొడవ జరిగింది. బాలిక పెళ్లి సంబంధం వివాదం హత్యకు దారి తీసింది.

Wife Killed Husband : కూతురు సాయంతో భర్తను హత్య చేసిన భార్య.. ఎందుకో తెలుసా?

కోమలను తల్లి, సోదరుడు చితకబాది, ఆపై ఆమె గొంతుకు చున్నీ బిగించి హత్య చేశారు. కూతురును చంపిన అనంతరం పోలీస్ స్టేషన్ లో తల్లి, సోదరుడు లొంగిపోయారుు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.