Cm Ramesh – Jagan: రాజకీయాల నుంచి తప్పుకుంటా- జగన్కు ఎంపీ సీఎం రమేశ్ సవాల్
క్రిమినల్స్ కు కూడా రాని కుట్రలు, కుతంత్ర ఆలోచనలతో జగన్ కుటుంబం పులివెందులలో అరాచకం మొదలు పెట్టిందని ఆరోపించారు.
Cm Ramesh – Jagan: మాజీ సీఎం జగన్ కు అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ సవాల్ విసిరారు. వైఎస్ వివేకాను ఎవరు హత్య చేశారని సోషల్ మీడియాలో అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్ ప్రమేయం ఉందని 80శాతం ఆరోపణలు రాకపోతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. జగన్ అనేక నేరాలు చేసి ఇప్పుడు శాంతి దూతలా మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుతున్నారని విమర్శించారు. క్రిమినల్స్ కు కూడా రాని కుట్రలు, కుతంత్ర ఆలోచనలతో జగన్ కుటుంబం పులివెందులలో అరాచకం మొదలు పెట్టిందని ఆరోపించారు.
”వివేకానంద రెడ్డి హత్యని ఏ విధంగా చిత్రీకరించారో చూశాం. మీ సోషల్ మీడియాలోనే ఒక క్వశ్చన్ వేసుకోండి. రాష్ట్ర ప్రజలారా వివేకానంద రెడ్డి హత్యను ఏ విధంగా భావిస్తున్నారు? ఎవరు చేశారు? అని ప్రజలను అడగండి. 80 శాతం నుంచి 90 శాతం మీ మీద ఆరోపణలు రాకుంటే నేను రాజకీయం నుంచి సన్యాసం తీసుకుంటాను.
వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్ హస్తం ఉందని మీరు నమ్ముతున్నారా లేదా అని అడిగి చూడండి. నమ్ముతున్నాము అని ఎక్కువ మంది చెప్పకపోతే నేను ఎంపీ పదవికి రాజీనామా చేసి రాజకీయాలు మానుకుంటా. జగన్ మోహన్ రెడ్డి ఒక క్రిమినల్ అని, ఆయనది గొడ్డలి పార్టీ అనేది ప్రజల్లోకి బాగా వెళ్లింది. దాన్ని డైవర్ట్ చేయడానికే ఒక శాంతి దూతలా బిల్డప్ ఇస్తున్నారు. నేను మంచి వాడిని అని చెప్పుకుంటున్నారు” అంటూ జగన్ పై నిప్పులు చెరిగారు సీఎం రమేశ్.
Also Read: పవన్ కళ్యాణ్ వార్నింగ్.. వెంటనే MLA అరవ శ్రీధర్ రాజీనామా
