Mithun Reddy : కుప్పంలో చంద్రబాబుని ఓడిస్తాం.. దొంగ ఓట్లపై వారివి తప్పుడు ఆరోపణలు
కుప్పం మున్సిపాలిటీ ఎన్నికలు ఏపీ రాజకీయాలను మరింత వేడెక్కించాయి. అధికార వైసీపీ, టీడీపీ మధ్య అగ్గి రాజేశాయి. కుప్పం మున్సిపల్ ఎన్నికల నోటిషికేషన్ వచ్చిన నాటి నుంచి

Mithun Reddy
Mithun Reddy : కుప్పం మున్సిపాలిటీ ఎన్నికలు ఏపీ రాజకీయాలను మరింత వేడెక్కించాయి. అధికార వైసీపీ, టీడీపీ మధ్య అగ్గి రాజేశాయి. కుప్పం మున్సిపల్ ఎన్నికల నోటిషికేషన్ వచ్చిన నాటి నుంచి వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. కాగా, మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లో దొంగ ఓట్లు వేశారని వైసీపీపై టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తుననారు. దీనికి వైసీపీ నేతలు అంతే ఘాటుగా బదులిస్తున్నారు. దొంగ ఓట్ల ఆరోపణలను ఖండిస్తున్నారు. కుప్పంలో దొంగ ఓట్లు అని టీడీపీ చేస్తున్న ఆరోపణలు అర్థరహితం అన్నారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. దొంగ ఓట్లు వేశారని ఇంతవరకు అధికారికంగా ఒక్క ఫిర్యాదు కూడా దాఖలు కాలేదని ఆయన స్పష్టం చేశారు.
అంతేకాదు దాడులు జరిగాయని కూడా ఒక్క ఫిర్యాదు నమోదు కాలేదన్నారు. ఎన్నిక అంతా సక్రమంగా జరిగిందని అన్ని పార్టీల ఏజెంట్లు సంతకాలు పెట్టిన తర్వాతే బ్యాలెట్ బాక్సులు సీలు వేశారని ఆయన వెల్లడించారు. పోలింగ్ బూత్ లోపల ఎక్కడైనా గొడవ జరిగిందా..? ఒకరి తరపున వేరొకరు ఓట్లు వేస్తే అసలు ఓటర్లు బయటకు వస్తారు కదా ఎక్కడైనా వచ్చారా..? అని ప్రశ్నించారు.
Eyes : నిద్రలేవగానే రెండు అరచేతులు రుద్ది కళ్ళకు అద్దుకుంటే ఏమౌతుంది?
‘దొంగ ఓటర్లని వీడియోలు తీశారు.. ఒక్కరి చేతిపైన అయినా ఇంక్ వేసిన దాఖలా ఎందుకు లేదు.. కుప్పం నియోజకవర్గంలోని ఇతర మండలాల నుంచి టీడీపీ నాయకులు వచ్చి భయభ్రాంతులు సృష్టించారు. వారే వీడియోలు తీసి తప్పుడు కథనాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు’ అని టీడీపీపై మిథున్ రెడ్డి మండిపడ్డారు.
‘కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి బూత్‌లోనూ వీడియో షూట్ చేశారు. ఫొటోలతో కూడిన ఓటర్ లిస్టు అధికారులు, ఏజెంట్ల దగ్గర ఉంది. ఓటర్లు కూడా ఐడీ కార్డులు తీసుకెళ్తే చెక్ చేశాకనే ఓటు వేయడానికి పంపారు. అంతా బాగానే ఉందని టీడీపీ ఏజెంట్లు కూడా సంతకాలు పెట్టాకే బాక్సులు సీజ్ చేశారు. కానీ దొంగ ఓట్లు అంటూ ఎందుకు గగ్గోలు పెడుతున్నారు? వాస్తవాలు ఏంటో జనానికి తెలియాల్సిన అవసరం ఉంది. అక్రమాలు జరిగిన బూతులను ఈసీకి ఫిర్యాదు చేయాలి. మేము కూడా ఆ బూతులో విచారణ జరపమని కోరుతాం. బూతులో గొడవలు జరిగితే వెబ్ కాస్ట్‌లో కనిపించేది కదా? దొంగ ఓటు పడితే ఫిర్యాదులు ఎందుకు అందలేదు? కాబట్టి ఇవన్నీ తప్పుడు ఆరోపణలు’ అని మిథున్ రెడ్డి అన్నారు.
Snoring : గురకతో ఎముకలకు ముప్పే…
”చంద్రబాబు కుప్పం వస్తున్నట్లు ప్రచారం చేసి ఇతర ప్రాంతాల నాయకులను రప్పించారు. పార్టీ ఆఫీసు నుంచి వేలాది మందిని రప్పించారు. ఇలాంటి తప్పుడు పనులన్నీ టీడీపీ వారే చేసి మాపై బురద జల్లుతున్నారు. ప్రజాస్వామికవాదులందరూ కుప్పంలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగినట్టు భావిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో వైసీపి గెలిచింది. టీడీపీ బాయ్ కాట్ చేస్తే పది శాతం వారు ఎలా గెలుస్తారు? ఎగ్జిట్ పోల్స్ లో వైసీపి గెలుస్తుందని తేలింది.
ప్రజలు జగన్ ని ఆదరించారు. కుప్పం ఓటర్లే చంద్రబాబుకు ఇంతకాలం మేలు చేశారే తప్ప చంద్రబాబు వారికి చేదిందేమీ లేదు. హంద్రీనీవాతో జగన్ కుప్పంకి నీరు ఇస్తున్నారు. 25వేల దొంగ ఓట్లు ఉన్నాయని గతంలో మేము ఫిర్యాదు చేస్తే ఈసీ విచారణ జరిపి 18 వేలు దొంగ ఓట్లు తొలగించారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో టీడీపీ ఓటమి కోసం ప్రయత్నిస్తాం. కుప్పంలో కూడా చంద్రబాబుని ఓడిస్తాం. లోకేష్, చంద్రబాబు మాటలతో రాజకీయాలు భ్రష్టు పడుతున్నాయి. వారు మాట్లాడినట్లు మాట్లడం మా సంస్కృతి కాదు” అని మిథున్ రెడ్డి అన్నారు.