Andhra Pradesh : మొదటి భార్య ఇన్ స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నాడని.. భర్త మర్మాంగాలను కోసేసిన రెండో భార్య

గత రాత్రి ఆనంద్ బాబు తన మొదటి భార్య ఇన్ స్టాగ్రామ్ వీడియోలు చూస్తుండటంతో తనను పెళ్లి చేసుకుని ఆమె వీడియో ఎందుకు చూస్తున్నావని రెండో భార్య వరమ్మ ఆనంద్ బాబు ప్రశ్నించారు.

Andhra Pradesh : మొదటి భార్య ఇన్ స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నాడని.. భర్త మర్మాంగాలను కోసేసిన రెండో భార్య

second wife injure husband

Updated On : July 22, 2023 / 1:42 PM IST

Second Wife Injures Husband : ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లాలో దారుణం జరిగింది. తన మొదటి భార్య ఇన్ స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నాడని భర్త మర్మాంగాలను రెండవ భార్య కోసేశారు. ఈ ఘటన నందిగామ లోని అయ్యప్ప నగర్ లో చోటు చేసుకుంది. వివరాళ్లోకి వెళ్తే.. ముప్పాళ్ళ గ్రామానికి చెందిన కోట ఆనంద్ బాబు మొదటి పెళ్లి చేసుకుని భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంలో విడిపోయారు.

అనంతరం వరమ్మను ఆనంద్ బాబు రెండో పెళ్లి చేసుకున్నారు. గత ఐదేళ్ల క్రితం వరమ్మను పెళ్ళి చేసుకుని ముప్పాళ్ళలో నివాసం ఉన్నారు. ఆనంద్ బాబు, వరమ్మ 5 నెలల క్రితం నుంచి నందిగామలో నివాసం ఉంటున్నారు. గత రాత్రి ఆనంద్ బాబు తన మొదటి భార్య ఇన్ స్టాగ్రామ్ వీడియోలు చూస్తుండటంతో తనను పెళ్లి చేసుకుని ఆమె వీడియో ఎందుకు చూస్తున్నావని రెండో భార్య వరమ్మ ఆనంద్ బాబు ప్రశ్నించారు.

Snake Found In Sambar : భోజనం చేస్తుండగా సాంబర్ లో కనిపించిన పాము.. ఈసీఐఎల్ క్యాంటీన్ లో ఘటన

ఇరువురి మధ్య వాగ్వివాదం నెలకొంది. భార్యాభర్తలు ఒకరినొకరు కొట్టుకున్నారు. ఈ క్రమంలో రెండవ భార్య వరమ్మ బ్లేడ్ తో భర్త ఆనంద్ బాబు మర్మాంగాలను కోసేశారు. తీవ్ర రక్తస్రావం కావడంతో అతన్ని చికిత్స కోసం నందిగామ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. మెరుగైన వైద్యం కోసం వైద్యులు అక్కడి నుంచి విజయవాడకు తరలించారు.