Nara Bhuvaneswari: వారివి పిచ్చిమాటలు.. అలాంటి వ్యాఖ్యలను పట్టించుకోను -నారా భువనేశ్వరి

అసెంబ్లీలో వైసీపీ నేతలు తనపై చేసిన వ్యాఖ్యలు పనికిమాలినవని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి.

Nara Bhuvaneswari: వారివి పిచ్చిమాటలు.. అలాంటి వ్యాఖ్యలను పట్టించుకోను -నారా భువనేశ్వరి

Bhuvanamma

Updated On : December 20, 2021 / 3:11 PM IST

Nara Bhuvaneswari: అసెంబ్లీలో వైసీపీ నేతలు తనపై చేసిన వ్యాఖ్యలు పనికిమాలినవని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి. అలాంటి మాటలను తాము పట్టించుకోబోమని భువనేశ్వరి స్పష్టంచేశారు.

వరద బాధితులకు ఎన్టీఆర్ ట్రస్ట్ తరుపున సాయం అందించేందుకు తిరుపతిలో పర్యటిస్తున్న భువనేశ్వరి.. వరదల్లో చనిపోయిన ఒక్కొక్కరికి రూ.లక్ష రూపాయల చొప్పున స్వయంగా బాధిత కుటుంబాలకు అందజేస్తున్నారు.

ఈ సంధర్భంగా 10Tv ప్రతినిధితో మాట్లాడిన భువనేశ్వరి.. వాళ్ల గురించి ఎక్కువ మాట్లాడి సమయం వ్యర్థం చేసుకోబోమని అన్నారు. హెరిటేజ్‌పై కూడా విమర్శలు వచ్చాయని, పట్టించుకోబోమని అన్నారు.

తమ ట్రస్ట్‌ నుంచి ప్రజలకు సేవ చేయడమే లక్ష్యమన్నారు. చర్లపల్లి స్కూల్లో 200 మంది అనాథ పిల్లలను చదివిస్తున్నామని, తనకు తెలిసింది సేవ మాత్రమేనని అన్నారు. ఏ మహిళపై కూడా ఇటువంటి పిచ్చిమాటలు మాట్లాడవద్దని సూచించారు నారా భువనేశ్వరి. ఇలాంటి రాజకీయాలు సమాజానికి మంచివి కావని హితవు పలికారు.