సీఎం జగన్‌కు నారా లోకేష్ సవాల్

వైసీపీ చేస్తున్న ఆరోపణలు అన్నీ అవాస్తవమే అని సింహాద్రి అప్పన్నపై ప్రమాణానికి నేను సిద్ధం అంటూ వైసీపీ నాయకులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు నారా లోకేష్. మరోసారి సవాల్… నాపై జగన్ రెడ్డి చేస్తున్న,చేయిస్తున్న ఆరోపణలు అవాస్తవం అని సింహాద్రి అప్పన్నపై ప్రమాణం చెయ్యడానికి సిద్ధం. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సిద్ధమా? అని ప్రశ్నించారు నారాలోకేష్.
నేను 420 జగన్ రెడ్డికి సవాల్ విసిరితే 840 మొరుగుతోంది ఏంటి? ఏ1 కి దమ్మూ, ధైర్యం లేదా? దైవం మీద ప్రమాణం అనగానే తోకముడిచి పారిపోతున్నారు అంటూ ఘాటుగా ట్విట్టర్‌లో విమర్శించారు లోకేష్. ఇక్కడే తేలిపోయింది నాపై వైసీపీ చేసే ఆరోపణల్లో బురద రాజకీయం తప్ప నిజం లేదని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేను 420 జగన్ రెడ్డికి సవాల్ విసిరితే 840 మొరుగుతోంది ఏంటి?ఏ1 కి దమ్మూ,ధైర్యం లేదా?దైవం మీద ప్రమాణం అనగానే తోకముడిచి చర్చ అంటూ పారిపోతున్నారు.ఇక్కడే తేలిపోయింది నాపై వైకాపా చేసే ఆరోపణల్లో బురద రాజకీయం తప్ప నిజం లేదని.(1/2)
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) January 2, 2021
అంతకుముందు చంద్రబాబు రామతీర్ధం పర్యటనను కూడా జగన్ ప్రభుత్వం అడ్డుకుంటుంది అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు లోకేష్. లారీలు కాదు జగన్ రెడ్డే అడ్డంగా పడుకున్నా చంద్రబాబు గారి రామతీర్థం పర్యటనను అడ్డుకోలేడంటూ.. హిందూధర్మంపై జరుగుతున్న దాడిని, విగ్రహాల ధ్వంసాన్ని అడ్డుకోలేని జగన్, పోలీసులు కలిసి చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడానికి లారీలు అడ్డంగా పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? ప్రతిపక్ష నేత బయటకి వెళ్లకుండా గేటుకి తాళ్ళు కడతారు. ఇప్పుడు ఏకంగా లారీలు అడ్డంగా పెట్టారు. ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగానికి అడ్డు, అదుపు లేదు అంటూ విమర్శించారు.
లారీలు కాదు జగన్ రెడ్డే అడ్డంగా పడుకున్నా చంద్రబాబు గారి రామతీర్థం పర్యటనను అడ్డుకోలేడు.హిందూ ధర్మం పై జరుగుతున్న దాడిని అడ్డుకోలేని @ysjagan,విగ్రహాల ధ్వంసాన్ని అడ్డుకోలేని పోలీసులు కలిసి(1/2) pic.twitter.com/fACp2PY6an
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) January 2, 2021