ఇన్ఫోసిస్‌తో ఆంధ్రప్రదేశ్ సర్కారు ఒప్పందం.. నారా లోకేశ్ కీలక కామెంట్స్‌

ఇన్ఫోసిస్ చొరవ అభినందనీయమని మంత్రి నారా లోకేశ్ అన్నారు.

ఇన్ఫోసిస్‌తో ఆంధ్రప్రదేశ్ సర్కారు ఒప్పందం.. నారా లోకేశ్ కీలక కామెంట్స్‌

Nara Lokesh

Updated On : January 10, 2025 / 3:03 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చే స్కిల్ సెన్సస్ ప్రి-వాలిడేషన్ కోసం ఇన్ఫోసిస్ తో రాష్ట్ర సర్కారు ఒప్పందం చేసుకుంది. ఆర్థిక వనరులతో సంబంధం లేకుండా జనరేటివ్ ఏఐని ఉపయోగించి అభ్యర్థుల నైపుణ్యాల ముందస్తు ధ్రువీకరణ కోసం డిజిటల్ ప్లాట్‌ఫాంను అందించేందుకు ఇన్ఫోసిస్, ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ మధ్య ఒప్పందం కుదిరింది.

రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఇన్ఫోసిస్ తో ఈ ఎంవోయూ కుదిరింది. ఇన్ఫోసిస్ చొరవ అభినందనీయమని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద స్కిల్ సెన్సస్ డాటా ప్రివాలిడేషన్ కు ఇన్ఫోసిస్ ముందుకు రావడం అభినందనీయమని అన్నారు.

దీని ద్వారా రాష్ట్రంలో యువత ప్రస్తుత నైపుణ్యాలను అంచనా వేసి, మార్కెట్ డిమాండ్ కు తగ్గట్టుగా వారికి స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ ఇవ్వడానికి మార్గం సులభతరం అవుతుందని నారా లోకేశ్ తెలిపారు. రాష్ట్రంలో రాబోయే అయిదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాల లక్ష్యసాధనలో భాగస్వామి కావడానికి ఇన్ఫోసిస్ ముందుకు వచ్చిందని వివరించారు.

Pawan Kalyan : రోడ్డు ప్ర‌మాదంలో అభిమానుల మృతి.. ఘ‌ట‌నా స్థలాన్ని ప‌రిశీలించిన ప‌వ‌న్‌..