Nara Lokesh: ఢిల్లీ నుంచి ఏపీకి రానున్న నారా లోకేశ్.. ఎందుకంటే?

అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా రాజమండ్రి వెళ్తారు. ఎల్లుండి ఉదయం..

Nara Lokesh: ఢిల్లీ నుంచి ఏపీకి రానున్న నారా లోకేశ్.. ఎందుకంటే?

Nara Lokesh

Updated On : October 4, 2023 / 9:16 PM IST

Chandrababu Arrest Row: టీడీపీ నేత నారా లోకేశ్ శుక్రవారం తన తండ్రి చంద్రబాబు నాయుడిని కలవనున్నారు. ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. లోకేశ్ కొన్ని రోజులుగా ఢిల్లీలో ఉంటున్నారు. గురువారం సాయంత్రం ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా రాజమండ్రి వెళ్తారు. ఎల్లుండి ఉదయం ములాఖత్ లో చంద్రబాబును కలుస్తారు.

కాగా, స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు నాయుడి అరెస్టుతో లోకేశ్ ఢిల్లీలో ఉంటూ న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతున్నారు. అలాగే, ఢిల్లీలో పలువురు నేతలను కలిశారు. జాతీయ మీడియాతో మాట్లాడారు. మరోవైపు, సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్‌ పై వచ్చే సోమవారం విచారణ జరుగుతుంది. ఆ సమయానికి లోకేశ్ తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

చంద్రబాబు నాయుడు జైలు నుంచి ఈ నెల 9వ తేదీలోపు బయటకు వస్తారని టీడీపీ భావిస్తోంది. సోమవారం వరకు తమ నిరాహార దీక్షలు, నిరసనలు కొనసాగుతాయని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు బయటకు వచ్చే ప్రక్రియలో మరింత ఆలస్యం జరిగితే తాము మళ్లీ ఈ నెల 10వ తేదీ నుంచి నిరసనలకు కొత్త కార్యక్రమం చేపడతామని తేల్చి చెప్పారు.

Pawan Kalyan: తనకు అందిన నోటీసులపై పవన్ కల్యాణ్ సంచలన కామెంట్స్