విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు.. కూటమి అభ్యర్థి ఖరారు?

2024 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ టికెట్ ని ఆశించారు. కానీ, పొత్తులో భాగంగా అనకాపల్లి పార్లమెంట్ టికెట్ ను బీజేపీకి కేటాయించాల్సి వచ్చింది.

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు.. కూటమి అభ్యర్థి ఖరారు?

Updated On : August 12, 2024 / 5:20 PM IST

Visakha MLC By Election 2024 : విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి టీడీపీ సిద్ధమైంది. అయితే కూటమి అభ్యర్థి ఎంపికలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. కూటమి తరుపున పోటీకి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. దీంతో అనూహ్య పరిణామాల తర్వాత కూటమి అభ్యర్థి ఎంపికను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్ధిగా బైరా దిలీప్ చక్రవర్తి పేరును కూటమి ఫైనల్ చేసినట్లు సమాచారం. చంద్రబాబు అనుమతితో దీనిపై అధికారికంగా ప్రకటించనున్నారు.

రేపటితో ముగియనున్న నామినేషన్ల గడువు..
2024 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ టికెట్ ని బైరా దిలీప్ చక్రవర్తి ఆశించారు. కానీ, పొత్తులో భాగంగా అనకాపల్లి పార్లమెంట్ టికెట్ ను బీజేపీకి కేటాయించాల్సి వచ్చింది. దీంతో బైరా దిలీప్ చక్రవర్తికి ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారని సమాచారం. రేపటితో నామినేషన్ల గడువు ముగియనుంది. ఇప్పటికే వైసీపీ అభ్యర్థిగా సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. ఈ నెల 30న విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది.

అనూహ్యంగా తెరపైకి బైరా దిలీప్ పేరు..!
విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూటమి అభ్యర్థి ఎంపికపై కొన్ని రోజులుగా ఉత్కంఠ నెలకొంది. స్థానిక సంస్థల ఓట్లు కొంచెం కూటమికి తక్కువగా ఉండటంతో పోటీ చేయాలా వద్దా అనే మీమాంస ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ జిల్లా నేతలు చర్చలు జరిపారు. గెలుపుపై సాధ్యాసాధ్యాలు పరిశీలించేందుకు ఆయన ఆరుగురు సభ్యులతో ఒక కమిటీని వేశారు. స్థానిక సంస్థల ఓట్లు వైసీపీకి ఎక్కువగా ఉన్నా.. అందరూ అనూహ్యంగా అధికార పార్టీవైపు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు బలంగానే ఉన్నామని నేతలు భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో పోటీకి కూటమి కూడా ఆసక్తి చూపింది. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ ఇన్ని రోజులు పోటీ చేసేందుకు ఆసక్తి చూపారు. కానీ, సడెన్ గా నిన్న ఆయన పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన నేతలంతా బైరా దిలీప్ పేరును అభ్యర్థిగా ఖరారు చేశారు. అయితే, అధినేత చంద్రబాబు అనుమతి తర్వాత అధికారికంగా దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉంది.

Also : రోజుకో మలుపు తిరుగుతున్న దువ్వాడ ఫ్యామిలీ వ్యవహారం.. తాజాగా మరో ట్విస్ట్

బైరా దిలీప్‌కు న్యాయం చేయాలనే భావనలో టీడీపీ హైకమాండ్..!
బైరా దిలీప్ గత కొంత కాలంగా అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో సేవా కార్యక్రమాలు చేస్తూ పార్లమెంటుకు పోటీ చేయాలని ఆశించారు. గత ఎన్నికల్లో ఆయన టీడీపీలో కీలక పాత్ర పోషించారు. ఆయన చాలా కష్టపడి పని చేశారని అధిష్టాన వర్గం దగ్గర గుర్తింపు ఉంది. ఆయనకు న్యాయం చేయాలని భావిస్తున్నారు. గతంలో ఆయనకు పార్లమెంట్ స్థానం వచ్చినట్లే వచ్చి చేజారింది. పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని బీజేపీకి (సీఎం రమేశ్ కు కేటాయించారు. దీంతో బైరా దిలీప్ కు న్యాయం చేయాలని భావించిన టీడీపీ హైకమాండ్.. ఆఖరి నిమిషంలో ఈ సీటుకి బైరా దిలీప్ కరెక్ట్ అని పార్టీ భావిస్తోంది. అందుకే ఆయన పేరుని దాదాపుగా ఖరారు చేశారు.