ఏపీ కొత్త ఎస్ఈసీగా నీలం సాహ్ని నియాకం
ఏపీ కొత్త ఎన్నికల కమిషనర్ గా(SEC)నీలం సాహ్ని నియమితులయ్యారు.

Neelam Sahni Appointed As New Sec
NEELAM SAHNI ఏపీ కొత్త ఎన్నికల కమిషనర్ గా(SEC)నీలం సాహ్ని నియమితులయ్యారు. ఈ నెలాఖరులో ప్రస్తుత ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో కొత్త ఎస్ఈసీ పదవికి ముగ్గురు అధికారుల పేర్లను ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించగా..నీలం సాహ్ని పేరునే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఖరారు చేశారు.
కాగా, కొద్ది నెలల క్రితం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రిటైర్డ్ అయిన సాహ్ని ప్రస్తుతం సీఎం జగన్ ముఖ్య సలహాదారుగా కొనసాగుతున్నారు. త్వరలోనే ఆమె ముఖ్యసలహాదారు పదవికి రాజీనామా చేసి..ఏప్రిల్ -1,2021న ఏపీ కొత్త ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టనున్నారు.