SEC Neelam Sahni : ఏపీ ఎస్‌ఈసీగా నీలం సాహ్ని

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని బాధ్యతలు స్వీకరించారు. నూతన ఎస్‌ఈసీగా నియమితులైన నీలం సాహ్నికి అధికారులు అభినందనలు తెలియజేశారు.

SEC Neelam Sahni : ఏపీ ఎస్‌ఈసీగా నీలం సాహ్ని

Sec Neelam Sahni

Updated On : April 1, 2021 / 2:10 PM IST

Neelam Sahni appointed as the AP SEC : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని బాధ్యతలు స్వీకరించారు. నూతన ఎస్‌ఈసీగా నియమితులైన నీలం సాహ్నికి అధికారులు అభినందనలు తెలియజేశారు. ఇప్పటి వరకు ఏపీ ఎన్నికల కమిషనర్‌గా కొనసాగిన నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ పదవీ కాలం మార్చి 31తో ముగిసింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని నియమితులయ్యారు.

పరిషత్ ఎన్నికలపై తొలిరోజే నీలం సాహ్ని కసరత్తు ప్రారంభించే అవకాశం ఉంది. నేడు పంచాయతీరాజ్ అధికారులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈనెల 17లోగా పరిషత్ ఎన్నికలు పూర్తి చేసే ఆలోచనలో స్నాహీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈనెల 8న పోలింగ్, 10న ఫలితాలు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల ప్రక్రియ ఆగిన చోట నుంచే మొదలుపెట్టే చాన్స్ ఉంది.