40 ఇయర్స్..ఇలాంటి పాలన చూడలేదు..నరరూపహంతకులు – బాబు

‘40 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నా..ప్రస్తుత పాలనలో జరుగుతున్న అరాచక పాలన తాను ఎప్పుడూ చూడలేదు..ప్రజాస్వామ్యానికి సిగ్గు చేటు..ఇతను సీఎంగా ఉండడం అరిష్టం..పెట్టబడులు రావడం లేదు..కోర్టు వ్యాఖ్యలు చేస్తోంది..పారదర్శకంగా ఎన్నికలు జరగాలి..ఒక్క మాటలో చెప్పాలంటే..నరరూపక హంతకులు..అధికారులను హెచ్చరిస్తున్నా’ అంటూ టీడీపీ చీఫ్ చంద్రబాబు వ్యాఖ్యానించారు.
స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వ తీరు, పోలీసులు, ఎన్నికల అధికారులు వ్యవహరిస్తున్న వైఖరిని ఆయన తప్పుబట్టారు. శాంతిభద్రతలను పర్యవేక్షించాల్సిన పోలీసులు చట్టవ్యతిరేకంగా చేస్తుంటే ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు. 2020, మార్చి 12వ తేదీ గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. దాడులు చేసినా, బెదిరించినా..ఎవరూ భయపడవద్దని అభ్యర్థులకు సూచించారు. ప్రభుత్వానికి సంబంధించిన హోర్డింగ్స్, ఫ్లెక్సీలు ఇంకా కనబడుతున్నాయని వివరించారు.
ఇవన్నీ ఎన్నికల అధికారులకు కనిపించడం లేదా ? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎవరూ నామినేషన్ వేయడానికి వీల్లేదని, ధైర్యం చేసి..వెళ్లిన వారిని బెదిరించడం..కొట్టడం లాంటివి చేస్తున్నారని విమర్శించారు. దురుద్దేశ్యపూర్వకంగా నామినేషన్లను తిరస్కరిస్తున్నారని తెలిపారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను చూపించారు. 15 మండలాల్లో స్క్రూటీని చేశారని, స్క్రూటీల్లో నామినేషన్లను తిరస్కరిస్తున్నారని, కొన్ని ప్రాంతాల్లో ఏకగ్రీవం చేసుకున్నారని వివరాలు వెల్లడించారు.
వైఎస్ వివేకా హత్య కేసు జరిగి సంవత్సరమౌతోందని, ఈ కేసులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. విశాఖపట్టణంలో తనపై జరిగిన ఘటనపై కోర్టు వ్యాఖ్యలు చేసిందని విమర్శించారు. ఎవరు నియోజకవర్గం అనుకుంటున్నారు ? ప్రభుత్వంలో నెంబర్ 2 మంత్రిదని..భవిష్యత్‌లో పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఓ పోలీస్ హెచ్చరిస్తున్నారని బాబు తెలిపారు.
Read More :కరోనా లేదు : నా పౌల్ట్రీకి రూ. 10 కోట్ల నష్టం వచ్చింది – ఈటల