స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో కొత్త పరిణామం.. అప్రూవర్‌గా మారిన A13

ఈ కేసులో తాను అప్రూవర్ గా మారుతున్నట్లు ఏసీబీ కోర్టుకు తెలిపారు. ఆయన స్టేట్ మెంట్ రికార్డ్ చేయాలని సీఐడీ తరపు న్యాయవాదులు కోరారు.

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో కొత్త పరిణామం.. అప్రూవర్‌గా మారిన A13

AP Skill Development Scam

Updated On : January 5, 2024 / 5:11 PM IST

Skill Development Scam : ఏపీలో సంచలనం రేపిన స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో కొత్త పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ13గా ఉన్న చంద్రకాంత్ షా అప్రూవర్ గా మారారు. చంద్రకాంత్ షా విజయవాడ ఏసీబీ కోర్టుకు చేరుకున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఇప్పటికే చంద్రకాంత్ షా మొబైల్ ఫోన్లు, డాక్యుమెంట్స్, కంప్యూటర్, ల్యాప్ టాప్స్ ఏసీబీ కోర్టుకు సమర్పించింది ఏపీ సీఐడీ.

స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసుకు సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్ లో సైంటిఫిక్ ఎనాలసిస్ తర్వాత ఏసీబీ కోర్టులో ప్రవేశ పెట్టింది సీఐడీ. ఈ కేసులో తాను అప్రూవర్ గా మారుతున్నట్లు ఏసీబీ కోర్టుకు తెలిపారు చంద్రకాంత్ షా. చంద్రకాంత్ షా స్టేట్ మెంట్ రికార్డ్ చేయాలని సీఐడీ తరపు న్యాయవాదులు కోరారు.

Also Read : కాపులలో చిచ్చు పెట్టేందుకు కుట్రలు, వైసీపీ వలలో చిక్కుకోవద్దు- కాపు పెద్దలకు పవన్ కల్యాణ్ విన్నపం

అప్రూవర్ గా మారిన నిందితుడు చంద్రకాంత్ షాను విచారించే క్రమంలో కేసుకు సంబంధించిన డాక్యుమెంట్స్ అడిగారు చంద్రబాబు తరపు న్యాయవాదులు. కోర్టుకు సీఐడీ సమర్పించిన డాక్యుమెంట్స్ ఇవ్వాలని అడిగారు. దీనిపై పిటిషన్ దాఖలు చేయాలని చంద్రబాబు న్యాయవాదులను అదేశించింది కోర్టు. అప్పటివరకు చంద్రకాంత్ షా స్టేట్ మెంట్ రికార్డు వాయిదా వేసింది ఏసీబీ కోర్టు.

కాగా, చంద్రబాబు తరపు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది కోర్టు. చంద్రకాంత్ షా స్టేట్ మెంట్ ఎప్పుడు రికార్డ్ చేయాలి అనేది అదే రోజు చెబుతామంది న్యాయస్థానం. ఇక ఈ కేసు సంబంధించి మరో వాయిదా కావాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరారు.

Also Read : ఎన్నికల వేళ షాక్.. టీడీపీకి కేశినేని నాని గుడ్ బై?

స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసు ఏపీ రాజకీయాలను కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో దాదాపు రెండు నెలల తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు చంద్రబాబు.