Kesineni Nani: ఎన్నికల వేళ షాక్.. టీడీపీకి కేశినేని నాని గుడ్ బై?
విజయవాడ పార్లమెంట్లోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై ఎంపీ కేశినేని నానికి టీడీపీ అధిష్ఠానం షాక్..

Kesineni Nani
ఎన్నికల వేళ విజయవాడ ఎంపీ, టీడీపీ నేత కేశినేని నాని ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి తొలి వారంలో పార్లమెంట్ సభ్యత్వంతో పాటు పార్టీ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేయనున్నట్లు సమాచారం. తదుపరి కార్యాచరణపై ఆయన ప్రణాళికలు వేసుకుంటున్నారు.
టీడీపీలో కొనసాగలేనని ఆ పార్టీ అధిష్ఠానానికి ఇప్పటికే కేశినేని నాని తేల్చి చెప్పారు. అంతేకాదు, విజయవాడ పార్లమెంట్లోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై ఎంపీ కేశినేని నానికి టీడీపీ అధిష్ఠానం షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. విజయవాడ ఎంపీ టిక్కెట్‌ను వేరే వారికి కేటాయిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఈ విషయాన్ని తెలుపుతూ తన ఫేస్ బుక్ ఖాతాలో కేశినేని నాని ఇవాళ ఉదయమే పోస్ట్ చేశారు.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో కేశినేని నాని, ఆయన తమ్ముడు నాని వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. తిరువూరులోని టీడీపీ కార్యాలయం వద్ద రెండు వర్గాల వారు పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ నెల 7న చంద్రబాబు సభ ఉండడంతో దాని ఏర్పాట్లపై కేశినేని నాని, కేశినేని చిన్ని తిరువూరుకు వెళ్లారు. ఫ్లెక్సీల్లో కేశినేని నాని ఫొటో లేదని ఆయన వర్గం వారు రచ్చ రచ్చ చేశారు. దీంతో ఇరు వర్గాలు గొడవపడి టీడీపీ కార్యాలయంలోని ఫర్నిచర్ ను పగులగొట్టారు.
ఈ ఘటన తర్వాత కేశినేని నాని ఫేస్‌బుక్‌లో పలు వివరాలు తెలిపారు. ఎన్నికలో తన స్థానంలో విజయవాడ లోక్‌సభ అభ్యర్థిగా వేరేవారికి అవకాశం ఇవాలనుకుంటున్నారని, కాబట్టి ఎక్కువగా పార్టీ వ్యవహారంలో తనను జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు ఆదేశించారని చెప్పారు. అధినేత ఆజ్ఞలను తూచా తప్పకుండా శిరసావహిస్తానని చెప్పారు.
Kesineni Nani: ఎన్నికల వేళ కేశినేని నానికి టీడీపీ హైకమాండ్ షాక్