Vizag Airport: విశాఖకు కొత్త విమానసర్వీసులు
కరోనా నెమ్మదిస్తుండటంతో విశాఖ విమానాశ్రయానికి విమాన సర్వీసులు నడిపేందుకు విమానయాన సంస్ధలు ముందుకువస్తున్నాయి. ప్రస్తుతం విశాఖ విమానశ్రయానికి రోజుకు 10 విమాన సర్వీసులు నడుస్తున్నాయి.

Vizag Flight Services
Vizag Airport: కరోనా నెమ్మదిస్తుండటంతో విశాఖ విమానాశ్రయానికి విమాన సర్వీసులు నడిపేందుకు విమానయాన సంస్ధలు ముందుకువస్తున్నాయి. ప్రస్తుతం విశాఖ విమానశ్రయానికి రోజుకు 10 విమాన సర్వీసులు నడుస్తున్నాయి. దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో లాక్‌డౌన్ సడలింపులతో పబ్లిక్ ట్రాన్స్ పోర్టు సిస్టమ్ ఇప్పుడిప్పుడే గాడిలో పడుతుంది. ఈక్రమంలో విమానయాన సంస్ధలు కూడా ప్రయాణికుల కోసం సర్వీసులను పునరుద్ధిరిస్తున్నాయి.
విశాఖ నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు చేరుకునేలా జులై 1 నుంచి విశాఖ ఎయిర్‌పోర్టుకు కొన్ని సంస్ధలు విమానాలను నడపనున్నాయి. స్పైస్ జెట్ సంస్ధ జులై 1 నుండి ముంబై, హైద్రాబాద్, కోల్‌కత్తా, చెన్నై నగరాలకు విమానాలు నడపనుంది.
ముంబైలో ఉదయం 7.05 గంటలకు బయలుదేరే విమానం 8.30 గంటలకు విశాఖ వస్తుంది. ఇక్కడి నుంచి 8.55కి బయలుదేరి 10.55 గంటలకు కోల్‌కతా చేరుతుంది. అక్కడి నుంచి తిరిగి 11.20 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1.25 గంటలకు విశాఖపట్నం వస్తుంది. ఇక్కడి నుంచి 2.00 గంటలకు బయలుదేరి 3.30 గంటలకు హైదరాబాద్ చేరుతుంది. అక్కడి నుంచి సాయంత్రం 4.05 గంటలకు బయలుదేరి 5.20 గంటలకు విశాఖపట్నం వస్తుంది. ఇక్కడి నుంచి 5.45 గంటలకు బయలుదేరి రాత్రి 7.25 గంటలకు చెన్నై చేరుతుంది.
వీటితో పాటుగా మరికొన్ని విమానయాన సంస్ధలు విశాఖ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు విమాన సర్వీసులను నడిపేందుకు ముందుకు వస్తున్నాయి.