Night curfew In AP : APలో నేటి నుంచే నైట్ కర్ఫ్యూ..మాస్క్ ధరించకపోతే రూ.100 జరిమానా
ఏపీలో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించింది. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుంది.

Night Curfew Will Be Enforced In Ap
Night curfew will be enforced in AP : ఏపీలో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించింది. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుంది. అత్యవసర సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంటుంది. దాంట్లో భాగంగానే ప్రభుత్వం అంతర్రాష్ట్ర సరుకు రవాణా వాహనాలకు మినహాయింపునిచ్చింది. వివాహాలు, మతపరమైన, సామాజిక కార్యక్రమాలను కనుక బహిరంగంగా నిర్వహిస్తే గరిష్ఠంగా 200 మంది వరకు, హాలులో అయితే 100 మంది వరకు పాల్గొనేందుకు మాత్రమే అనుమతి ఉన్నట్టు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
కర్ఫ్యూ నిబంధనలో భాగంగా సినిమా హాళ్ళలో 50శాతం సీటింగ్ నిబంధన విధించింది ప్రభుత్వం. నిబంధనలో భాగంగా మాస్కు ధరించం అత్యంత తప్పనిసరి చేసింది ప్రభుత్వం. మాస్కు ధరించకపోతే రూ.100 జరిమానా తప్పదని ప్రభుత్వం హెచ్చరించింది. కోవిడ్ నుంచి ఆస్పత్రులు మెడికల్ ల్యాబ్ లో ఫార్మసీ రంగాలతోపాటు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా టెలికమ్యూనికేషన్ ఇంటర్నెట్ సర్వీసులు పైపు ప్రసార సేవలు ఐటి సంబంధించిన సేవలు పెట్రోల్ బంకులు విద్యుత్ నీటి సరఫరా పారిశుద్ధ్య సిబ్బందికి మినహాయింపునిచ్చింది.
నేటి నుంచి అమలులోకి వచ్చే నిబంధలు ఇవే..
ప్రజలందరూ మాస్కులు ధరించడం తప్పనిసరి..
మాస్కు ధరించకపోతే..రూ. 100 జరిమానా..
వివాహాలు, శుభకార్యాలు, మతపరమైన కార్యక్రమాల విషయంలో బహిరంగ ప్రదేశాల్లో 250 మందికి మించకూడదు..
ఏ కార్యక్రమానికి హాజరైనా కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించి తీరాల్సిందే..
సినిమాలలో సీటు వదిలి సీటు విధానాన్ని పాటించాలి..ప్రేక్షకులకు విధిగా మాస్కు ధరించాలి..
ప్రజారవాణా వాహనాల్లో సిబ్బందితో పాటు ప్రయాణికులందరు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి..
వ్యాపార వాణిజ్య సంస్థల యాజమాన్యాలు తమ ఆవరణలో ఉన్న వారందరూ మాస్కులు ధరించి చర్యలు తీసుకోవాలి..లేకుంటే రూ.10,000 నుంచి 25 వేల వరకు జరిమానా..
మార్కెట్లో షాపింగ్ మాల్స్ వంటి ప్రదేశాల్లో కోవిడ్ నిబంధనలు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించాలి..లేకుంటే జరిమానాతో పాటు ఒకటి లేదా రెండు రోజులపాటు షాపులు మార్కెట్లు మూసి వేసేలా చర్యలు..
మార్కెట్ అసోసియేషన్లు యాజమాన్యాలు ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేపట్టాలి..
దేవాలయాలు ప్రార్థన మందిరాలు మతపరమైన ప్రదేశాల్లో నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలి..