టీడీపీ- జనసేన ఫస్ట్‌లిస్ట్‌లో సీనియర్లకు నో చాన్స్‌

TDP-Janasena: దేవినేని ఉమా మహేశ్వరరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, యరపతినేని శ్రీనివాసరావు, బీకే పార్థసారధితో పాటు..

టీడీపీ- జనసేన ఫస్ట్‌లిస్ట్‌లో సీనియర్లకు నో చాన్స్‌

TDP Janasena 1st List: మరికొన్ని వారాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీడీపీ-జనసేన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. తొలి జాబితాలో పలువురు తెలుగుదేశం పార్టీ సీనియర్లకు చోటు దక్కలేదు.

కళా వెంటట్రావు, గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ మూర్తి, చింతమనేని ప్రభాకర్, దేవినేని ఉమా మహేశ్వరరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, యరపతినేని శ్రీనివాసరావు, బీకే పార్థసారధి, మండలి బుద్ద ప్రసాద్ పేర్లు ఈ జాబితాలో లేవు.

సంబరాలు.. నిరసనలు
టీడీపీ-జనసేన తొలి జాబితా ప్రకటించడంతో అందులో పేర్లు ఉన్న నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ అభ్యర్థిగా డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పేరును అధిష్ఠానం ప్రకటించడంతో ఆ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.

డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతానని అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో టీడీపీ సంబరాలు చేసుకుంది.

విజయనగరం జిల్లాలో గజపతినగరం టీడీపీలో అసమ్మతి రగిలింది. నియోకవర్గ ఇన్‌చార్జ్ డా.కేఏ నాయుడుకి టికెట్ ఇవ్వకపోవడంపై తీవ్ర మనస్తాపంలో నాయుడు వర్గం ఉంది. ఎన్నికలను బహిష్కరించేలా నిర్ణయం తీసుకోవాలంటూ నాయుడిపై ఒత్తిడి తెస్తోంది కేడర్. కొండపల్లి శ్రీనివాసరావుకి ఇక్కడ టికెట్ కేటాయించిన విషయం తెలిసిందే.

Read Also: చంద్రబాబు ఏది పడేస్తే దానికి తృప్తిపడటం పవన్‌కు అలవాటైంది : సజ్జల రామకృష్ణారెడ్డి