Visakha Metro rail: 2017 తరువాత విశాఖలో మెట్రో రైలు ప్రతిపాదనేది ఏపీ ప్రభుత్వం నుంచి రాలేదన్న కేంద్రం

విశాఖ నగరంలో మెట్రో రైలు ప్రాజెక్ట్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రతిపాదనేది సమర్పించలేదని కేంద్రం స్పష్టం చేసింది.

Visakha Metro rail: 2017 తరువాత విశాఖలో మెట్రో రైలు ప్రతిపాదనేది ఏపీ ప్రభుత్వం నుంచి రాలేదన్న కేంద్రం

Gvl

Updated On : March 28, 2022 / 5:59 PM IST

Visakha Metro rail: విశాఖ నగరంలో మెట్రో రైలు ప్రాజెక్ట్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రతిపాదనేది సమర్పించలేదని కేంద్రం స్పష్టం చేసింది. పార్లమెంటు సమావేశాల్లో భాగంగా సోమవారం ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర గృహనిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. కేంద్రం ఇచ్చిన సమాధానంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఎంపీ జీవీఎల్ నరసింహాహారావు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలుగుప్పించ్చారు. విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్ట్ కోసం కేంద్రానికి ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనను సమర్పించక పోవడం దిగ్భ్రాంతికరమని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు.

Also read:Karnataka Hijab row: కర్ణాటకలో పదో తరగతి విద్యార్థిని బురఖా తీయించి పరీక్షకు అనుమతి ఇచ్చిన స్కూల్ యాజమాన్యం

ఇది రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతుందని జీవీఎల్ అన్నారు. విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్ట్ కోసం సెప్టెంబర్ 2017లో ప్రతిపాదనను సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అభ్యర్థించామని అయితే ఇప్పటివరకు ఎటువంటి ప్రతిపాదన రాలేదని కేంద్ర గృహనిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపినట్టు ఎంపీ జీవిఎల్ నరసింహారావు పేర్కొన్నారు. విశాఖ నగరంలో రూ.12,345 కోట్లతో 42.55 కిలోమీటర్ల పొడవుతో మెట్రో రైలు నెట్‌వర్క్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో ప్రతిపాదనను సమర్పించిందని, అయితే తర్వాత దానిని కొనసాగించలేదని కేంద్రం స్పష్టం చేసింది.

Also read:Bandi Sanjay On Telangana : సెంటిమెంట్ రగిలించే కుట్ర జరుగుతోంది – ఎన్నారైలతో బండి సంజయ్

మెట్రో రైల్ పాలసీ, 2017 ప్రకారం, కేంద్ర ప్రభుత్వం PPP ప్రాజెక్ట్‌లకు 20 శాతం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్‌ను అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఈ అవకాశాన్ని వినియోగించుకోలేదని ఎంపీ జీవీఎల్ విమర్శించ్చారు. ఆగస్టు 2017 నుండి దేశంలో మొత్తం 23 మెట్రో రైలు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని.. కేంద్ర ప్రభుత్వ నిధులతో సహా ఈ ప్రాజెక్టుల మొత్తం వ్యయం రూ. 2.51 లక్షల కోట్లుగా ఉన్నట్లు జీవీఎల్ నరసింహారావు వివరించారు. విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుపై ప్రస్తుత వైసీపీ, గత టీడీపీ ప్రభుత్వాలు ఆసక్తి చూపకపోవడం దిగ్భ్రాంతికరం, శోచనీయమని ఆయన అన్నారు.

Also read:Osmania University: ఓయూ లేడీస్ హాస్టల్ వద్ద విద్యార్థినుల ఆందోళన

ఆంధ్రప్రదేశ్‌లోని ఏకైక మెగా సిటీ విశాఖపట్నంకు ప్రపంచ స్థాయి పట్టణ రవాణా సదుపాయాలు అవసరమని.. రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం, పెరుగుతున్న నగర రవాణా అవసరాల కారణంగా, విశాఖపట్నంలో ట్రాఫిక్ గందరగోళంతో నగరవాసులకు కష్టతరంగా మారిందని ఎంపీ జీవీఎల్ అసహనం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో ప్రపంచ స్థాయి మెట్రో రైలు నెట్‌వర్క్‌ను నిర్మించడానికి ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Also read:YCP vs TDP: వైసీపీ, టీడీపీ నేతల ఘర్షణ.. గాజువాకలో ఉద్రిక్తత